వైసీపీ ఆవిర్భావం రోజే బిగ్ డెసిషన్
వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ యువత పోరుకి సన్నద్ధమౌతోంద? ఈ నెల 12వ తేదీన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన అన్ని రకాల పోస్టర్లు కూడా విడుదల అయ్యాయి. ఈ ఆందోళన సందర్భంగా రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాలని పార్టీ నిర్ణయించింది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీల సంకీర్ణ కూటమి ప్రభుత్వం చదువుతున్న స్టూడెంట్స్ కి ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించకపోవడాన్ని నిరసనగా యువత పోరు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ.
యువత పోరు పోస్టర్‌ను తాజాగా తిరుపతిలోని పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆ పోస్టర్ ఆవిష్కరించారు. రాష్ట్రం లోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు భరోసాగా ఉంటూ చంద్రబాబు – పవన్ కల్యాణ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో భాగంగా యువత పోరును నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పెద్దలు చెప్పారు.
గడచిన ఈ తొమ్మిది నెలల్లో ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ విడుదల కావట్లేదంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తోంది. ఇకపోతే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందంటూ ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్ప్రభుత్వం వారి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను సైతం ప్రైవేటీకరించే ప్రయత్నిస్తోందంటూ ఆరోపిస్తోన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఈ మూడు ప్రధాన హామీలు అమలు చేయని కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ర్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయని కారణంగా విద్యార్థులు చదువులకు దూరమైపోతున్నారని వారు విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా యువతను వారు మోసగిస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో ముందుచూపుతో ఒకేసారి ఏకంగా మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి, వాటిలో అయిదు కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు.
కాబట్టి ఈ నెల మార్చి 12వ తేదీన వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవమని, అందుకే అదే రోజున పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున ర్యాలీగా యువత పోరు కార్యక్రమంలో పాల్గొంటారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కచ్చితంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలను నిర్వహిస్తామని, తమ నిరసనను తెలియజేస్తామని చెప్పారు.more