Y. S. Jagan Mohan Reddy ; జగన్‌ కు అతి పెద్ద గుడ్ న్యూస్

Written by srikanth

Published on:

Y. S. Jagan Mohan Reddy ; జగన్‌ కు అతి పెద్ద గుడ్ న్యూస్

 

Y. S. Jagan Mohan Reddy ; జగన్‌ కు అతి పెద్ద గుడ్ న్యూస్
Y. S. Jagan Mohan Reddy ; జగన్‌ కు అతి పెద్ద గుడ్ న్యూస్

జగన్‌ కు అతి పెద్ద గుడ్ న్యూస్..వైసీపీలోకి ఒక కీలక నేత రీఎంట్రీ.. ఇస్తున్నారా?

గతంలో ఎప్పుడు చూడని విపత్కర పరిస్థితులను ఇప్పుడు వైసీపీ చూస్తోంది. గత ఎన్నికల్లో వైసిపి ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంది.. ఒకప్పుడు 151 స్థానాల్లో ఘన విజయం సాధించిన ఆ పార్టీ , 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంది.కానీ ఇప్పుడు వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈసారి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది.11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించ లేకపోయింది. అయితే ఈసారి కేవలం 4 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయినట్టు మనకి తెలుసు. ఇది చాలా విచారకరం వైసిపి కి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో, మరికొన్ని కారణాలతో వైసీపీ యొక్క కంచు కోటలు కూడా బద్దలయ్యాయి. వైసీపీ ఘోర ఓటమితో ఆ క్యాడర్ మొత్తం డీలా పడిపోయింది.

మరోవైపు పార్టీలో ఉన్న కీలక నేతలంతా కూడా ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలంతా కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు.పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం ఇటీవలే పార్టీతో పాటు, తన రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇవి అన్ని వైసిపి పార్టీ కి ఘోర దెబ్బలు గా నిలిచాయి.

అయితే
పార్టీ నుంచి వెళ్లే వారు నీ తప్పిస్తే..పార్టీలోకి వచ్చే నేతలెవ్వరూ కనిపించడం అస్సలు లేదు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో గత ఎన్నికల ముందు పార్టీని వీడిన నేత , తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ నేత మరెవరో కాదు.. సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డి. గడిచిన సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన వైసీపీని వదిలి బీజేపీలో చేరారు. ఆయన రాయలసీమలోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నో సార్లు ఎమ్మెల్యే గా కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు.2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు , తిరిగి టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు.

దీంతో అప్పుడు ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి ఏమాత్రం మెరుగు పడకపోవడం, అదే సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో ఆయన బీజేపీలోకి చేరారు…గత ఎన్నికల్లో ఏపీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మెట్టు గోవింద రెడ్డి వైసీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు.అయితే టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు ఇక్కడ నుంచి విజయం సాధించారు.ఓడిపోయిన తర్వాత మెట్టు గోవింద రెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా లేరు.

ఆయన బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదు.అని సమచారం..దీని వల్ల పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది.ఇదే సమయంలో కాపు రామచంద్రారెడ్డి సైతం తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారనే ప్రచారం ముమ్మరం గా జరుగుతుంది .బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి ఆయన తన సొంత గూటికి చేరుకోవాలని చూస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది.జగన్‌తో తనకున్న సాన్నిహిత్యం కారణంగా ఆయన తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నట్టు సమాచారం అంందుతోంది . ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే జగన్ జిల్లాల పర్యటన సమయంలో ఆయన వైసీపీ తీర్థం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది.more

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Sreekanth Maravindla, I am the Writer and Founder of this blog and share all the information related Trending News , Local News, Movie Updates, Politics, Health Tips, Job Opportunities and Technology through this website.

Leave a Comment