Virat kohli and wife Anushka Sharma Welcome their second baby on February 15 2024
భారత క్రికెటర్ virat kohli మరియు bollowood నటి anushka sharma దంపతులకు రెండవ మగ బిడ్డ జన్మించినట్లు social media వేదికగా అందరికీ తెలియచేశారు. వారికి ఫిబ్రవరి 15 2024 బిడ్డ జన్మించినట్లుగా మరియు తనకు Akaay అనే పేరు పెట్టినట్లుగా instagram వేదికగా తెలియ చేశారు.Virat Kohli మరియు Anushka sharma వారి ఆనందాన్ని ఈ విధంగా instagram post ద్వారా తెలియ చేశారు

With abundant happiness and our hearts full of love, we are pleased to inform everyone that on 15th February, we welcomed our baby boy Akaay & Vamika’s little brother into this world! We seek your blessings and good wishes in this beautiful time in our lives. We request you to kindly respect our privacy at this time.
View this post on Instagram
మా జీవితంలోని ఈ అందమైన సమయంలో మీ యొక్క ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు మేము కోరుకుంటున్నాము. ఈ సమయంలో మా యొక్క గోప్యతను గౌరవించాలని మేము అభ్యర్థిస్తున్నాము. ప్రేమ మరియు కృతజ్ఞతతో విరాట్ మరియు అనుష్క అంటూ విరుష్క దంపతులు ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
అంతే కాకుండా విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నాడని గత కొంతకాలంగా సోషల్ మీడియా ఈ విషయం కోడై కూస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా, కోహ్లి యొక్క సహచరుడు, దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ సోషల్‌మీడియాలో ఈ విషయం గురించి ప్రస్తావించారు. 2017లో విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ 2021లో మొదటి సంతానం వామికకు జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే.
Anushka Sharma , Virat Kohli దంపతులకు మగబిడ్డ పుట్టాడని తెలియడంతో బాలీవుడ్ లోని ప్రముఖులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు అందరూ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నటుడు రణవీర్ సింగ్, “♥️♥️♥️♥️”లవ్ ఎమోజీలను షేర్ చేశాడు. శ్వేతా బచ్చన్ వారికి “అభినందనలు” తెలిపింది.
ప్రస్తుతం Virat Kohli Indian team లేడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆయన ఆడటం లేదు ఈ మ్యాచ్‌లన్నింటికీ ఆయన దూరంగా ఉంటోన్నాడు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ సిరీస్‌కు దూరమైనట్లు విరాట్ కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ప్రసవ సమయంలో తన భార్యకు దగ్గరగా ఆయన ఉండాలనే కారణంతో సిరీస్ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తుంది.
ముంబైలోని ఒక టాప్ కార్పొరేట్ ఆసుపత్రిలో అనూష్క శర్మ ఈ నెల 15వ తేదీన రెండవ బిడ్డకు జన్మనిచ్చారు. పండంటి బాబు జన్మనిచ్చారు ఈ బాబు అనుష్క కోహ్లీ దంపతులకు రెండో సంతానం. ప్రస్తుతం వారికి ఒక కుమార్తె ఉంది తన పేరు వామిక కిందటి నెలతో వామిక మూడోవ సంవత్సరంలో అడుగు పెట్టింది.
ఇప్పుడు వామికకు తమ్ముడు వచ్చాడని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. విరాట్ కోహ్లీ, అనూష్క శర్మ ఒక ఇంటి వాళ్లై ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయింది. 2017 డిసెంబర్ 11వ తేదీన ఇటలీలోని టస్కనీలో వారిద్దరూ పెళ్లిపీటలు ఎక్కిన విషయం అందరికి తెలిసిందే.