TDP Party ; నిజాయితీ ఉన్న టీడీపీ కార్యకర్తలు కావాలి
ఇప్పుడు ఈ మాటలు ఎవరిని ఉద్దేశించినవి?
Pawan Kalyan గారు: జయకేతనం అనే పేరుతో మన కాకినాడ జిల్లా లో పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు దారి తీసింది. అధినేత, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ తో సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా అతి పెద్ద దుమారం రేపుతున్నాయి.
అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ గారి ఆధ్వర్థ్యం లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ యొక్క సంకీర్ణ కూటమి- అంత కలిసి భవిస్యత్ ఎలా ఉండబోతోందనే విషయంపై చర్చజరిగింది. కూటమి భాగస్వామి లో బీజేపీలో సైతం చర్చనీయాంశమౌతోంది.
ప్రత్యేకించి- ఈ సభలో నాగబాబు చేసిన ప్రసంగం అనేక సంచలనాలకు తెర తీసింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి సహాయ పడింది పూర్తిగా జనసేన నాయకులు, అని, వారి కార్యకర్తలేనని తేల్చి చెప్పడం జరిగింది. అంతే కాదు ఒకవేళ తామే గెలిపించామనుకుంటే అది వారి ఖర్మేనంటూ ఆయన చురకలు అంటించడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మను ఉద్దేశించే నాగబాబు గారు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. గతం లో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కోసం తన సీటును సైతం త్యాగం చేశారు వర్మ. పొత్తులో భాగంగా నే పిఠాపురాన్ని వదలుకున్నారు. తొలి జాబితాలోనే ఆయనను శాసన మండలికి పంపిస్తానంటూ చంద్రబాబు కూడా అప్పట్లో హామీ ఇచ్చారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన MLA కోటా MLC ఎన్నికల్లో వర్మకు చోటు దక్కలేదు. ఆయన స్థానాన్ని నాగబాబు ఆక్రమించుకున్నారనే వార్త ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. దానికి అనుగుణంగా నే అదే నాగబాబు ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ లో వేదికగా పరోక్షంగా వర్మను ఉద్దేశించి తాజా వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది..
అంతే కాదు పవన్ కల్యాణ్ సైతం
భయమన్నది లేదు! టీడీపీని నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ సంచలనం వ్యాఖ్యలు చేశారు..
ఇకపోతే .. జనసేన ఆవిర్భావ సభ తరువాత జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు తెలుగుదేశం పార్టీ మ్యూచువల్ అభిమానులు.. దీన్ని సోషల్ మీడియాలో ట్రెడింగ్‌లోకి తీసుకొస్తున్నారు. దీనికి విపరీతంగా రీట్వీట్లు, షేర్లు వస్తున్నాయి.. ఇంతకీ ఆ వీడియో లో ఏముంది అంటే..
మనకు కావాల్సింది కల్తీ నాయకులు కాదు. నిజాయితీ కలిగిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కి కావాలి. పార్టీకి కష్టం వస్తే కాపాడుకునే యోధులు కావాలి.. అంటూ ఎన్టీఆర్ ఆ వీడియోలో చెప్పరు. .
మొత్తానికి అటు పాట వీడియో ,ఇటు కొత్త జనసేనా ఆవిర్భావ దినం నాడు నాగబాబు చేసిన ప్రసంగాలు ఇప్పుడు అంధ్ర ప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ముందు ముందు చూడాలి.more