Tata Motors Demerge: TATA Motors shares hit 52-week high

Written by srikanth

Published on:

రెండు కంపెనీలుగా విడిపోనున్న టాటా మోటార్స్ పెరుగుతున్న షేర్ల ధరలు

భారతదేశ దిగ్గజ సంస్థ అయిన టాటా గ్రూప్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ గ్రూప్‌కు చెందిన కార్ మేకర్ మరియు టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విడతీయాలనే ప్రతిపాదనకు బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో ఒకే కంపెనీ రెండు వేరు వేరు కంపెనీలుగా మారనున్నాయి. అయితే ఇక్కడ చిక్కు ప్రశ్న ఏంటి అంటే టాటా మోటార్స్ షేర్లను వాటాదారులకు ఎలా పంచుతారు?

Tata Motors Demerge: TATA Motors shares hit 52-week high

టాటా మోటార్స్ ( TATA Motors ) సంస్థ రెండుగా విడిపోనుంది. దీనిని రెండు వేర్వేరు సంస్థలుగా నమోదు చేసి విభజించాలనే ప్రతిపాదనకు ఆ కంపెనీ బోర్డు సోమవారం రోజు ఆమోదం కూడా తెలిపింది. అయితే ఇక మీదట వాణిజ్య వాహనాల వ్యాపారం (కమర్షియల్ వెహికిల్స్ బిజినెస్), దానికి సంబంధిత పెట్టుబడులు ఒక సంస్థగా ఉంటయి. ప్రయాణికుల వాహనాల వ్యాపారం (ప్యాసింజర్ వెహికిల్ బిజినెస్) విద్యుత్ తో నడిచే వాహనాలు (EV- ఎలక్ట్రిక్ వాహనాలు), జేఎల్ఆర్ (జాగ్వార్ ల్యాండ్ రోవర్), విటన్నింటికి సంబంధించిన పెట్టుబడులు మరొక సంస్థగా విడిపోనున్నట్లు దిగ్గజ సమస్థ టాటా మోటార్స్ ఈ సోమవారం రోజు ఎక్స్చేంజీలకు సమాచారం అందించింది. SCLT స్కీమ్ ఆఫ్ అరెంజ్‌మెంట్ కింద ఈ విభజన ప్రక్రియ ఉంటుందని తెలియచేసారు. అయితే టాటా మోటార్స్ లో షేర్లు ఉన్న టాటా మోటార్స్ వాటాదారులు అందరికీ ఈ రెండు నమోదిత సంస్థల్లోనూ షేర్లు లభిస్తాయని తెలిపింది కంపెనీ.

Tata Motors Demerge: TATA Motors shares hit 52-week high

 

అయితే ‘ప్రస్తుతం మా వద్ద ఉన్న 3 వాహన వ్యాపారాలు స్వతంత్రంగా చూసుకుంటే స్థిరమైన పనితీరు కనబరుస్తున్నాయి. డీమెర్జర్ ద్వారా మార్కెట్లో ఉన్న అవకాశాల్ని ఒడిసి పట్టుకునేందుకు, ఆయా విభాగాల్లో మేము దృష్టి కేంద్రీకరించేందుకు చాలా అవకాశం ఉంటుంది.’ అని టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు.

మా సంస్థ వాటాదారులు సహా రుణ దాతలు, నియంత్రణ సంస్థల అనుమతులు వచ్చేందుకు దరిదాపు 12 నుంచి 15 నెలల సమయం పట్టొచ్చని, అయితే ఈ విభజనతో సంస్థలోని ఉద్యోగులు, కస్టమర్లు, మా వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రభావం పడదని చైర్మన్ చంద్రశేఖరన్ వివరించారు.

గత కొంతకాలంగా టాటా మోటార్స్ యొక్క కమర్షియల్, ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ వంటి విభాగాలు మార్కెట్ లో బాగా రాణిస్తున్నాయి. అందుకు ఆ సంస్థ కొన్నేళ్లుగా అమలు చేసిన సరైన వ్యూహాలు ఇందుకు కారణం. అయితే 2021 నుంచే ఈ విభాగాలన్నీ వేర్వేరుగా పనిచేస్తున్నాయి గతంలో కూడా టాటా స్టీల్‌లో 7 కంపెనీలు విలీనం అయిన సంగతి మన అందరికి తెలిసిందే.

Tata Motors Demerge: TATA Motors shares hit 52-week high

అయితే ఈ పరిణామాల మధ్య సోమవారం రోజు టాటా మోటార్స్ యొక్క షేరు స్వల్పంగా పుంజుకొని రూ. 988.90 వద్ద స్థిరపడింది. అంతే కాదు రూ. 955 వద్ద ఒక దశలో 52 వారాల గరిష్టాన్ని కూడా ఈ సంస్థ నమోదు చేసింది. కంపెనీ మార్కెట్ విలువ వొచ్చి రూ. 3.62 లక్షల కోట్లుగా ఉంది. టాటా సంస్థ ప్రకటన నేపథ్యంలో ఇవాళ ఈ షేరు వాల్యూ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

టాటా మోటర్స్ గ్రూప్ ఈ మధ్య కాలంలో తమ వ్యాపారాల్లను వేగంగా విస్తరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. స్టాక్ మార్కెట్లో ఇప్పటికే 30 వరకు సంస్థలు లిస్ట్ కాగా రాబోయే రెండేళ్లలో మరో 5 సంస్థలు లిస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. వీటిల్లో టాటా క్యాపిటల్, టాటా సన్స్, టాటా ప్లే వంటి సంస్థలు ఉన్నాయి.

టాటా మోటార్స్ డీమెర్జర్:

  • టాటా మోటార్స్ రెండు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోతుంది. టాటా మోటార్స్ PV మరియు CV వ్యాపారాలుగా విభజించబడుతుంది.
  • విభజనకు బోర్డు ఆ సంస్థ ఆమోదం తెలిపింది. అయితే వాటాదారులు రెండు కంపెనీల సమాన వాటాలను పొందుతారు.
  • ఈ విభజన ప్రక్రియ 12-15 నెలల్లో పూర్తవుతుందని సంస్థ యాజమాన్యం భావిస్తున్నారు.
  • విభజన ప్రక్రియ NCLT ద్వారా అమలు చేయబడుతుంది.
  • ఈ సంస్థ అన్ని వ్యాపారాలు 2021 నుండినే వివిధ CEOల క్రింద కొనసాగుతున్నాయి.more 
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Sreekanth Maravindla, I am the Writer and Founder of this blog and share all the information related Trending News , Local News, Movie Updates, Politics, Health Tips, Job Opportunities and Technology through this website.

Leave a Comment