Rashmika గురించి మరోసారి మాట్లాడిన రక్షిత్
ఇలాంటి మాటల్లో నిజమెంత అనేది పక్కనబెడితే కొందరి జీవితాలు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి వారిలో రష్మిక మదన ఒకరు ఎందుకంటే సొంతభాష కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పెద్ద హిట్ కొట్టింది. మరి అదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో రష్మికా నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఏమైందో ఏమో ఎవరికి తెలీదు గానీ పెళ్లి మాత్రం జరగలేదు. తాజాగా రష్మిక గురించి మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి రష్మిక గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న రష్మిక ఈ మధ్య ‘యానిమల్’ చిత్రంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోంది. ఇప్పుడు ఈమె చేతిలో ‘పుష్ప 2’, ‘రెయిన్ బో’, ‘గర్ల్ ఫ్రెండ్’ లాంటి పెద్ద చిత్రాలున్నాయి. సరే మరి సినిమాల సంగతి పక్కనబెడితే ఈమె గురించి మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి రష్మికా గురించి పలు వ్యాఖ్యలు చేశాడు.
అప్పట్లో రష్మికతో తన ఎంగేజ్‌మెంట్ మరియు పెళ్లి ఆగిపోవడం గురించి తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రక్షిత్ శెట్టి ‘తమ పెళ్లి ఆగితే ఏంటి? తామిద్దరం ఇప్పటికే టచ్‌లోనే ఉన్నాము రష్మికకు జీవితంలో పెద్ద డ్రీమ్ ఉండేది ఇప్పుడు తను దాన్ని సాకారం చేసుకుంది’ అని రష్మికా చెప్పుకొచ్చాడు. ఈ మాటల బట్టి చూస్తుంటే మరి ప్రేమికులుగా విడిపోయినప్పటికీ మంచి ఫ్రెండ్స్‌గా రష్మిక-రక్షిత్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారనమాట.