Rameshwaram Cafe Blast – What actually happened?

Written by srikanth

Published on:

Rameshwaram Cafe Blast; అసలేం జరిగిందంటే ?

బెంగుళూరు నగరంలో సంభవించిన భారీ పేలుడు దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. కుండలహళ్లిలోని బాగా ఫేమస్‌ అయినా రామేశ్వరం కేఫ్‌ వద్ద టైం బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్‌ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఈ సంఘటన టిఫిన్‌ బాక్స్‌లో ఐఈడీతో దాడి జరిపారని పేలుడు జరిగిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో క్లియర్ రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై తక్షణ దర్యాప్తు కొనసాగుతోందని త్వరలోనే ఈ సంఘటనకు కారణాలు భాద్యుతులను పట్టుకుంటాం అని ప్రకటించారాయన.

మొదట ఈ బ్లాస్ట్‌కి సిలిండర్లు కారణమని అంతా భావించారు. అయితే బాంబ్‌ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ టీం సేకరించిన ఆధారాలు పరిశీలిస్తే ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడుగా వారు గుర్తించారు. అయితే ఆ కేఫ్‌లో సిలిండర్లు ఎటువంటి డ్యామేజ్‌ కాలేదని గుర్తించింది అదే సమయంలో బోల్ట్‌లు, నట్లు, ఎలక్ట్రిక్‌ వైర్లను వాచ్‌ను (టైం బాంబ్‌ కోసం ఉపయోగించేది) ఇలాంటి పరికరాలను ఘటన స్థలంలో గుర్తించింది.  మరోవైపు రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అయినా (NIA) కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ ప్రాంతాన్ని మొత్తని ప్రస్తుతానికి తమ అదుపులోకి తీసుకుంది.

ఆ చుట్టూ ప్రక్కల సీసీఫుటేజీ ఆధారంగా ఉదయం 11 గం. ప్రాంతంలో కేఫ్‌లోని సింక్‌ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి తన బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆదారంగా గుర్తించారు. ఆ తర్వాత అతను అక్కడనుంచి వెళ్లిపోయాక 12 గంటల 46 నిమిషల సమయంలో అక్కడ బాంబు పేలింది. అతను వదిలిన ఆ బ్యాగ్‌లోని టిఫిన్‌ బాక్స్‌లోని బాంబ్‌ ఏ ఈ పేలుడుకు కారణమని, ఇది కచ్చితంగా ఉగ్రదాడే అయ్యి ఉంటుందని ఎన్‌ఐఏ ప్రాథమిక అంచనాకి వచ్చింది.

అసలేం జరిగిందంటే ?

బ్బెంగుళూర్ లోని రామేశ్వరం కేఫ్‌కు రోజుకి నాలుగు నుంచి ఐదు వేల మంది కస్టమర్లు వస్తుంటారు పోతూ ఉంటారు. ఈ శుక్రవారం మధ్యాహ్నాం సుమారు ఒంటి గంట ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లో భారీ శబ్దంతో ఒక పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన అక్కడున్న స్థానికులు పరుగులు తీశారు. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రుల్ని తక్షణమే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో మొత్తం తొమ్మిది మందిని బ్రూక్‌ఫీల్డ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా మిగిలిన అందరికీ ప్రాణాపాయం తప్పిందని కర్ణాటక డీజీపీ అశోక్‌ మోహన్‌ తెలియచేసారు.

‘‘కేఫ్ లో సిలిండర్‌ పేలిందన్న సమాచారంతో మేం ఇక్కడికి చేరుకున్నాం. అక్కడ గాయపడిన నలుగురిని మేము వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించాం. ఇక్కడ భారీ శబ్ధంతో పేలుడు సంభవించే సరికి అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది సిలిండర్‌ పేలుడా? లేదా ఏదైనా కుట్ర ఉందా? అనేది పోలీసులు తేలుస్తారు’’ అని వైట్‌ఫీల్డ్‌ ఫైర్‌ స్టేషన్‌ ఒక అధికారి చెప్పారు. more

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Sreekanth Maravindla, I am the Writer and Founder of this blog and share all the information related Trending News , Local News, Movie Updates, Politics, Health Tips, Job Opportunities and Technology through this website.

Leave a Comment