Rakul Preet Singh and Jackky Bhagnani share first wedding pics
టాప్ హీరోయిన్ Rakul Preeth Singh కొత్త పెళ్లికూతురిగా ముస్తాబైంది. తను ప్రేమించిన వాడినే పెళ్లిచేసుకుంది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో కలసి ఏడడుగులు వేసింది. గోవాలో బుధవారం (ఫిబ్రవరి 21న) మధ్యాహ్నం వీరి ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ యొక్క సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి కన్నుల పండుగగా జరిగింది. అయితే వరుడి సాంప్రదాయం ప్రకారం కూడా సింధి పద్ధతిలోనూ వీరు మరోసారి ముచ్చటగా పెళ్లి చేసుకోనున్నారు.
మూడు రోజుల నుంచే వీరి పెళ్లి సంబరాలు
ఫిబ్రవరి 19 నుంచే వీరి పెళ్లి సంబరాలు ప్రారంభం అయ్యాయి. మరి వీరి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు గోవా లో ఎంతో ఘనంగా జరిగాయి. హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా దంపతులు సహా చాలామంది సెలబ్రిటీలు వీరి సంగీత్‌లో స్టెప్పులేశారు. తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ తారలు వీరి పెళ్లికి హాజరై నూతన వధూవరులను అందరూ ఆశీర్వదించారు.
మరి రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని 2021 అక్టోబర్‌లో బయటపెట్టింది అది అందరికీ తెలిసిన విషయమే . అప్పటినుంచి ఇప్పటివరకు ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ బ్యూటీ కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌పైన చాలా ఫోకస్ చేసింది. అయితే ఇన్నాళ్లకు ప్రియుడితో కలిసి సరికొత్త జీవితం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఇండియన్ 2 సినిమా లో నటిస్తుంది. జాకీ భగ్నానీ విషయానికి వస్తే అతడు నిర్మించిన బడే మియా చోటే మియా సినిమా ఈద్ పండగకు థియేటర్లలో రిలీజ్ చేయనన్నారు.
అయితే వీరి పెండ్లి ఫొటోలను తాజాగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. ఈ పెండ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.