Pranay Case;ప్రణయ్ హత్యకేసులో సంచలన విషయాలు
ప్రణయ్ హత్యకేసులో అతి పెద్ద సంచలన విషయాలు చెప్పి అది పరువుహత్య కాదనీ దాని వెనుక నిజాల బయటపెట్టిన
హైడ్రా కమీషనర్
రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసు తీర్పు ఈరోజు తీర్పు ఇచ్చ్చారు. చాలా
సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం ఈరోజు తీర్పుని చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కేసులో ఏ 2 గా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
ప్రణయ్ హత్య కేసుపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ మాట్లాడుతూ,
ఇదే సమయంలో ప్రణయ్ పరువు హత్య పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో నాలుగు రోజుల కాలం లో నే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఇక ఇప్పుడు వచ్చిన కోర్టు తీర్పు పై రంగనాథ్ స్పందించారు. ఎస్సీ, ఎస్టీ కేసు కావడంతో మిర్యాలగూడ డిఎస్సీ శ్రీనివాసరావు టీం ఎన్తో సమర్ధవంతంగా పని చేశారని రంగనాథ్ తెలిపారు.
ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు – ఎవరికి ఉరిశిక్ష..!!
“ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు – ఎవరికి ఉరిశిక్ష..!!”
ప్రణయ్ హత్య కేసులో ఏం చేశారో చెప్పిన రంగనాథ్. తన పూర్తి టెక్నాలజీ ఆధారంగా ఈ కేసును ఆయన
సాల్వ్ చేసినట్లు చెప్పారు.. సుమారు గా ఇది, 8 నెలల పాటు ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు కొనసాగిందన్నారు. కాల్ డేటా దగ్గర మొదలుకొని దానికి సంబంధించిన ప్రతి అంశంలోను ఎంతో జాగ్రత్త వహించినట్టుగా రంగనాథ్ తెలిపారు. తాము కేసు దర్యాప్తులో ఎక్కడ వెనక్కి తగ్గలేదని, దర్యాప్తులో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్లామన్నారు. ఇది కోట్ల రూపాయల సుఫారీ తో కూడుకొని ఉన్న వ్యవహారం కావడంతో ప్రతి అంశం లో ను జాగ్రత్తగా ఫైల్ చేసినట్టుగా తెలిపారు.
చార్జి షీట్ కు ముందే అసలు ముందు ఏమేమి జరుగుతుంది అన్నదానిపైన గంటలు తరబడి ఎన్నో చర్చలు జరిగాయని, దీన్ని వల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తాయనేది దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లామని తెలిపారు. అప్పటి డీజీ మహేందర్ రెడ్డితో పాటు ఇతర అధికారుల సహకారం తమకు చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ హత్యకేసులో సాక్షులుగా ఉన్నవారు వారేం చెప్పారో అదే విషయానికి చివరి వరకు కట్టుబడి ఉన్నారని రంగనాథ్ వెల్లడించారు. ఈ విషయం లో ఆయన ఎంతో సంతోషించారు.
అయితే అది పరువు హత్య కాదు, కాంట్రాక్ట్ మర్డర్ అని అమృత, ప్రణయ్ తల్లి ప్రేమలత ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగలేదని చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారని పేర్కొన్నారు. అయితే 2018 సెప్టెంబర్ లో 14వ తేదీన జరిగిన ఈ హత్య పరువు హత్యగా ప్రచారం జరిగిందని అయితే తాము పోలీసులుగా ఆ విషయాన్ని అంగీకరించలేమన్నారు. ఎందుకంటే అది పరువు హత్య కాదన్నారు. ఒక కులానికి ఎక్కువ పరువు మరో కులానికి తక్కువ పరువు ఉండదు కేవలం ఒక కాంట్రాక్టు మర్డర్ అని రంగనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కేసు లో ఉన్న వారంతా తీవ్ర అభియోగాలు ఎదుర్కొన్న వారే.
కోట్ల రూపాయల లావాదేవీలతో ఈ హత్య జరిగిందని, ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న వారందారు తీవ్ర అభియోగాలు ఎదుర్కొన్న వారే అని రంగనాధ్ తెలిపారు.
అన్ని ఆధారాలతో 1600 పేజీల చార్జ్ షీట్ వేశామని ఎవరెన్ని విమర్శలు మేము ఏ మాత్రం వాటిని
పట్టించుకోకుండా ముందుకు వెళ్లి ఈ కేసును చేదించినట్టుగా రంగనాథ్ తెలిపారు.more