Prabhas Upcoming Movies in 2024

Written by srikanth

Published on:

Prabhas Upcoming Movies in 2024

రెబల్ స్టార్ హీరో Prabhas కెరీర్ పరంగా ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. గతేడాది ప్రభాస్ నటించిన ఆదిపురుష్ తన అభిమానులకు నిరాశను మిగిల్చినా, సలార్ సినిమా తో తన అభిమానులకు మతి పోగొట్టే హిట్ ని గిఫ్ట్ గా ఇచ్చిన విషయం మన అందరికి తెలిసిందే అయితే రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించాయి అని చెప్పాలి. అయితే డార్లింగ్ ప్రభాస్ ఖాతాలో ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సినిమాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ 10 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ భారీ సక్సెస్ సాధించాలని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం అనే చెప్పాలి.

అయితే ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ డైరెక్టర్ల జాబితాలో డేట్ల కోసం స్వల్పంగా మార్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కు ఈ స్థాయిలో మంచి క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంటే మరి కొందరు ప్రభాస్ పాపులారిటీ నీ చూడలేక లోలోపల కుల్లుకుపోతున్నరు. ప్రభాస్ నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో భారీస్థాయిలో లాభాలు వస్తున్నాయి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తే టేబుల్ ప్రాఫిట్స్ రావడం గ్యారంటీ అని ఇప్పటికే అన్ని సినిమాలు రుజువు చేశాయి. మరో ఐదేళ్ల వరకు ప్రభాస్ లైఫ్ బిజీ బిజీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్ ప్లానింగ్ అదుర్స్ అనేలా ఉన్నా కూడా ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్స్ పై కూడా కొంచం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేరే వేరే భాషలపై కూడా ప్రభాస్ దృష్టి పెట్టి మార్కెట్ ను ఇంకా ఎక్కువగా పెంచుకోవాలని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పట్లో ప్రభాస్ డేట్స్ మాత్రం దర్శకనిర్మాతలకు సులువుగా దొరకవని అభిమానులు సరదాగా సోషల్ మీడియా లో కామెంట్లు తెగ చేస్తున్నారు.

Prabhas Upcoming Movies in 2024 List

ఇక సినిమాల విషయానికి వొస్తే kalki 2898 AD , Salaar part 2, Shouryanga Parvam, The Raja Saab, మరియు Spirit సినిమాలు తన ఫ్యాన్స్ నీ అలరించడానికి అన్ని సిద్దం ఔతున్నయి. అయితే ఈ లిస్ట్ లో ఉన్న అన్ని సినిమాల మీద ఫ్యాన్స్ కి మరియు దేశం మొత్తానికి భారీ అంచనాలే ఉన్నాయి. తను సాధించిన రికార్డులను తానే మళ్ళీ ఈ సినిమాలతో తిరగ రాస్తడనీ అందరూ భావిస్తున్నారు.అయితే ఈ సినిమాలు అన్ని రిలీజ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఫ్యాన్స్ ఎదురు చూడక తప్పదు.

Kalki 2898 AD

2024 అంటే ఈ సంవత్సరం భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది మామూలు సినిమా కాదు ఇది ఒక సైన్స్ ఫెక్షన్ మూవీ అవ్వడంతో సినిమా ఎలా ఉండబోతుంది సినిమాలో ఎం చూడబోతున్నాం అందులో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు అనే ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతుంది ఫాన్స్ కి. అయితే ఈ సినిమాను Nag Ashwin తన అద్భుతమైన దర్శకత్వంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ట్ లు అయిన Amitabh Bachchan, Deepika Padukone, మరియు Disha Patani వీరు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాదు తమిళ నటుడు Kamal Haasan కూడ ఈ సినిమాలో నటించడంతో సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. చాలా రోజులు ఈ సినిమా కోసం ఎదురు చూసిన తరువాత may 9 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అంచనా వేస్తున్నారు.

Salaar Part 2: ( Shouryanga Parvam )

ఈ ఏడాది Salaar Part 1 Ceasefire Prashanth Neel దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఘన ఎంత ఘన విజయం సాధించిందో మన అందరికి తెలిసిన విషయమే, ఇందులో ప్రధాన పాత్రలు Prabhas , Prithviraj Sukumaran, Shruti Haasan, Jagapathi Babu పోషించారు. భారీ విజయం సాధించిన ఈ సినిమా దీని రెండవ పార్ట్ అయిన Salaar Part 2: ( Shouryanga Parvam ) ఎప్పుడెప్పుడు వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అయితే ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే క్లారిటీ చిత్ర యూనిట్ ఎటువంటి క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయితే పార్ట్ 2 షూటింగ్ మొత్తం దాదాపు అయిపోయింది అని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్నాయి అని చిత్ర యూనిట్ చెబుతుంది. మరి వేచి చేసి చూడాలి దలరింగ్ సాలార్ రూపంలో మళ్ళీ ఎప్పుడు తెరమీద కనిపిస్తాడా అని.

The Raja Saab

ఈ సంక్రాంతి కి డైరెక్ట్ Maruthi “The Raja Saab” అనే టైటిల్ పేట్టి ప్రభాస్ లుంగీలో నడుస్తున్న పోస్టర్ నీ రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ లో ప్రభాస్ లుక్ చూడగానే అభిమానుల కళ్ళలో ఆనందం నిండిపోయింది ఆ పోస్టర్ లో ప్రభాస్ మాస్ తెలుగోడి గెటప్ లో ఉన్నాడు కాబట్టి. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమా మాస్ లేదా కామెడీ సినిమా కాదు ఇది ఒక horro movie అని దర్శకుడు తెలియ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ టోటల్ గా ఒక కొత్త లుక్ లో అభిమానులకు కనిపిస్తాడు అని అంతే కాకుండా సినిమా చాలా భయంకరం గా horro theme లో ఉండబోతుంది అని దర్శకుడు తెలియ చేశారు.

Spirit

Prabhas చేతిలో ఉన్న మరి పెద్ద ప్రాజెక్ట్ Spirit ఈ సినిమాను arjun Reddy , Animal movie లను తీసిన దర్శకుడు Sandeep Reddy Vanga ఈ సినిమాను ప్రభాస్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కథ ఎలా ఉండబోతుందో ఎవరికి తెలీదు అయితే కొన్ని leaks ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో cop’s dress ప్రేక్షకులకు కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో సినిమా వొచ్చే వరకు అభిమానులు వేచి చూడక తప్పదు మరి.

ఇలా ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో తన కెరీర్ లో చాలా అంతే చాలా బిజీ బిజీ గా ఉన్నాడు . ఇప్పటి వరకు పక్కగా కన్ఫర్మ్ అయిన సినిమాలు అయితే ఇవి మిగిలిన ప్రోజెక్ట్ ల గురించి రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది. more

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Sreekanth Maravindla, I am the Writer and Founder of this blog and share all the information related Trending News , Local News, Movie Updates, Politics, Health Tips, Job Opportunities and Technology through this website.

Leave a Comment