Paytm కి భారీ ఊరట ఆంక్షలపై RBI కీలక ప్రకటన

Written by srikanth

Published on:

Paytm కి భారీ ఊరట ఆంక్షలపై RBI కీలక ప్రకటన

ప్రముఖ ఫిన్‌ టెక్‌ దిగ్గజం పేటీఎం ( Paytm ) , ఆ సంస్థ యొక్క అధినేత విజయ్‌ శేఖర్‌ శర్మకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) భారీ ఊరట ఇచ్చిందననే చ్చెప్పలి. 

ఇటీవల ఆర్‌బీఐ ‘Paytm Payments Bank’ (PPBL) 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న (ఇవాళ) ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తున్నాం అని RBI కీలక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత అన్ని నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

paytm వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్‌లో అడిగిన ప్రశ్నలకు RBI ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే ఉంది. Paytm పై  ఆంక్షలు విధించిన తరుణంలో యూజర్ల అనుమానాల్ని RBI నివృత్తి చేసింది. మరి అందులో పలువురు యూజర్లు అడిగిన ప్రశ్నలైతే ఇలా ఉన్నాయి.

Paytm Payments Bank జారీ చేసిన Fast tag ను వినియోగించొచ్చా? 


Fast Tag లో ఉన్న మొత్తాన్ని మీరు టోల్ చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే, మార్చి 15, 2024న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌లకు ఇకపై ఫైనాన్సింగ్ లేదా టాప్ అప్‌లు చేయడానికి అర్హత పొందలేవు. ఫాస్టాగ్‌ ప్రొడక్ట్‌లో క్రెడిట్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్ అందుబాటులో ఉండదు. కాబట్టి, మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన మీ పాత ఫాస్టాగ్‌ను మూసివేసి, రీఫండ్ కోసం మీరు బ్యాంక్‌ని అభ్యర్థించాల్సి ఉంటుంది.

మార్చి 15, 2024 ముగిసిన తర్వాత మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన మీ ఫాస్టాగ్‌ను రీఛార్జ్లను చేయలేరు. ఈ ఇబ్బందుల నుంచి సురక్షితంగా ఉండేందుకు నిర్ధేశించిన గడువులోపు మీరు మరొక బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్టాగ్‌ పొందాలి అని RBI అందరికి సూచించింది.

పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌లో ఉన్న బ్యాలెన్స్‌ ఎలా? 


మీరు వాలెట్‌లో ఉన్న బాలన్స్ ను ఉపయోగించడం, విత్‌ డ్రాయిల్‌ లేదా,  మీ బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయడం వంటివి కొనసాగించవచ్చు.  మార్చి 15, 2024 తర్వాత మీ పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ అస్సలు చేయలేరు అంతే కాదు డిపాజిట్‌ చేయలేరు. అయితే, ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ వరకు UPI/ IMPS ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి మీరు మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

నేను PPBL వాలెట్‌ని మూసివేసి, బ్యాలెన్స్‌ని మరొక బ్యాంక్‌లో నా బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయవచ్చా?


మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని సంప్రదించాల్సి ఉంటుంది లేదంటే దాని బ్యాంకింగ్ యాప్‌ని ఉపయోగించి మీ వాలెట్‌ని బ్లాక్‌ కూడా చేయొచ్చు. KYC వాలెట్ల విషయంలో బ్యాలెన్స్‌ని మరొక బ్యాంక్‌లో ఉపయోగించే అకౌంట్‌కు బదిలీ కూడా చేసుకోవచ్చు.  

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Sreekanth Maravindla, I am the Writer and Founder of this blog and share all the information related Trending News , Local News, Movie Updates, Politics, Health Tips, Job Opportunities and Technology through this website.

Leave a Comment