పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ : ఎవరిని వదిలిపెట్టేది లేదు
Pawan Kalyan: ysrcp కాంగ్రెస్‌కు చెందన సోషల్ మీడియా నాయకులు మరియు కార్యకర్తల అరెస్టుల వ్యవహారంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీసు వ్యవస్థను ఆయన బెదిరిస్తోన్నాడంటూ ఆరోపించారు.
ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ జనసేనకు చెందిన వివిధ సంస్థల కార్పొరేషన్ల ఛైర్మన్లతో సమావేశం అయ్యారు ఆ సమావేశంలో వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాడో చూశామని, సప్త సముద్రాలు దాటి వెళ్లినా తీసుకొస్తామంటూ పోలీసులను నేరుగా బెదిరించారని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ నాయకుల నుంచి వారి మీడియా నుంచి వచ్చే ఇలాంటి ప్రకటనలు గానీ, సోషల్ మీడియాలో పోస్టులపై గానీ బలంగా మనం స్పందించాలని పవన్ కల్యాణ్ వారికి సూచించారు. రాజకీయాలు అంటే ఎటువంటి ఆయుధాలు లేకుండా యుద్ధం చేయడంలాంటిదేనని పవన్ చెప్పారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా యుద్ధం చేయగలిగితేనే రాజకీయాల్లోకి రావాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
తమ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో చాలా పద్ధతిగా పోస్టులు పెట్టాలని, తమ వాదనలను ప్రజలకు వినిపించాలని పవన్ కల్యాణ్ కార్పొరేషన్ల ఛైర్మన్లకు సూచించారు. మనం విధాన పరంగా విమర్శలు చేయాల్సి ఉంటుందని, వాళ్ల కుటుంబ సభ్యుల జోలికి ఎట్టి పరిస్థితిలో వెళ్లకూడదని కోరారు. వ్యక్తిగతంగా ఎలాంటి పోస్టులు వేయొద్దని వారిని ఆదేశించాడు.
తమ వాదనలను బలంగా, ప్రస్ఫూటంగా ప్రజలకు వినిపించగలగాలని, మరీ తప్పదనుకుంటే గొడవ పెట్టుకుందామని పవన్ చెప్పారు. గొడవ పెట్టుకునే స్థాయి కూడా ప్రస్తుతం వైసీపీకి లేదని ఆయన సెటైర్లు వేశారు. సమాజంలో శాంతిభద్రతలు కాపాడటం అత్యవసరమని, అదే లేకపోతే నిలబడలేమని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలకు మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తల తరహాలో మనం బాధ్యతరహితంగా వ్యవహరించకూడదని, సోషల్ మీడియాలో ఇష్టం విచ్చినట్టు ఇష్టానుసారంగా సబ్జెక్ట్ లేకుండా వారిలా మాట్లాడొద్దని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి లభించిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, హుందాగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కార్పొరేషన్లకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే వాటిని తన పేషీ దృష్టికి తీసుకుని రావాలని పవన్ కల్యాణ్ చెప్పారు. నిధుల విడుదల వంటి అంశాలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, సమష్టిగా తమకు కేటాయించిన వివిధ కార్పొరేషన్లను అభివృద్ధి చేయాలని అన్నారు.more