Ooru Peru Bhairavakona Movie Released on OTT Platform
చాలా రోజుల తరువాత ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో రీసెంట్‌గా పెద్ద హిట్టు కొట్టాడు సందీప్ కిషన్. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ని వీఐ ఆనంద్ గారు డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 16న థియేటర్లో రిలీజైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది. మరి ఈ సినిమా ఏ OTT ప్లాట్ఫారమ్ లో రిలీజ్ అవుతుందో చూద్దాం.
అయితే ఈ ఊరు పేరు భైరవకోన అనే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో అయితే రిలీజైన ఒక నెల లోపే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. అయితే ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సందడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి రిలీజ్ చేశారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా లో వెన్నెల కిషోర్, రవిశంకర్, హర్ష చెముడు వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు చక్కటి మ్యూజిక్ అందించారు.
ఇదే జోరు మీద ఇక కెరీర్ విషయానికొస్తే సందీప్ కిషన్ ఈ మధ్య మంచి సినిమా లతో మంచి జోరు మీదున్నాడు. ఓవైపున తెలుగు సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోవైపు తమిళ సినిమాలో కూడా స్పెషల్ రోల్స్‌తో అందరిని మెప్పిస్తున్నాడు. ఈ మధ్య పొంగల్‌కి రిలీజైన ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో ఓక కీలక పాత్రలో కనిపించాడు సందీప్ కిషన్. ఈ సినిమా లో సందీప్ కిషన్ చేసిన రోల్‌కి మంచి ప్రశంసలు దక్కాయి. మరి ముఖ్యంగా క్లైమాక్స్‌లో సందీప్ కిషన్ ఎంట్రీ ఇచ్చిన సీన్ అయితే థియేటర్లో గట్టిగానే పేలింది. ఇక దీని తర్వాత కూడా ధనుష్ చేస్తున్న మరోక్క సినిమా ‘రాయన్’లో కూడా ఛాన్స్ కొట్టేశాడు సందీప్ కిషన్. ఈ సినిమా కూడా ఇదే ఏడాది రిలీజ్ కాబోతుంది చిత్ర యూనిట్ చెపుతుంది. ఇలా వరుసగా తమిళ సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు తెలుగు హీరో సందీప్ కిషన్. అయితే సోలో హీరోగా ఊరు పేరు భైరవకోనతో ఒక మంచి హిట్ కొట్టాడు సందీప్. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఏమాత్రం తగ్గకుండా జోరు చూపించింది.
ఊరు పేరు భైరవకోన కథ ఏంటి అంటే ?
ఈ సినిమా లో భైరవకోన అనే గ్రామం చాలా విచిత్రం. ఈ ఊర్లోకి ఒక్కసారి అడుగుపెట్టిన వాళ్లు మళ్లీ ప్రాణాలతో తిరిగి వచ్చిన దాఖాలాలు అస్సలు లేవు. అలాంటి ఆ గ్రామంలోకి సందీప్ కిషన్ తన స్నేహితులతో కలిసి ఆ గ్రామంలోకి అడుగుపెడతారు. ఓక దొంగతనం చేసి పోలీసులకు నుంచి తాను తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఊర్లోకి చేరతాడు సందీప్ కిషన్. అక్కడ వారందరు ఎదుర్కొన్న పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు ఆ భైరవకోన గ్రామంలో ఏమి జరుగుతుంది ? మరి గరుడ పురాణంలో మిస్ అయిన నాలుగు పేజీలతో ఆ భైవరకోన గ్రామానికి మధ్య ఉన్న సంబంధం ఏంటీ ? సందీప్ కిషన్ తన స్నేహితులతో కలిసి ఆ గ్రామం నుంచి ఎలా బయటపడ్డాడు ? అనేది ఊరు పేరు భైరవకోన కథ సినిమా చూస్తే నీ తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఇంకెందుకు ఆలస్యం ఒకసారి చూసేయండి.more