28 అవార్డులతో హిట్టు కొట్టిన థ్రిల్లర్ సినిమా
28 అవార్డులతో ఇండస్ట్రీలో హిట్టు కొట్టిన సూపర్ థ్రిల్లర్ సినిమా. ఇది యూట్యూబ్లో ఫ్రీగా ఉంది.. కాబట్టి దీన్ని అస్సలు మిస్సవ్వకండి!
ఈ రోజుల్లో అంతా ఓటీటీల యుగం నడుస్తుంది. ఎవరిని అడిగినా ఒటీటీ అని చేస్తున్నారు.. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు ఏమేమి వస్తున్నాయా అని ott ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా కొత్త సినిమాలే కాదు కాన్సెప్ట్ కొత్తగా ఉండే పాత సినిమాలు వేరే భాష అయినా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు ott లవర్స్
.
సో ఇప్పుడలాంటి సినిమా గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అస్సలు ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా? ఆ సినిమా పేరే కహాని. ఇది 2012లో వచ్చిన ఈ సినిమాకు సుజోయ్ ఘోష్ గారు దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి విద్యా బాలన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించింది.. ఇది బాలీవుడ్లో నే బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో నెంబర్ వన్ గా నిలిచింది.
ఈ మిస్టరీ థ్రిల్లర్ కహానీ గురించి సుజోయ్ ఘోష్ ఈ విధం గా చెప్పాడు. ఇందులో విద్యా బాలన్ తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరమబ్రత చటర్జీ, అద్వైత కాలా కూడా ఉనారు. ఈ సినిమా ఒక ప్రెగ్నెంట్ మహిలా చుట్టూ తిరుగుతుంది. ఇది తన మిస్సైన భర్త కోసం కలకత్తాకు రావడం చుట్టూ తిరుగుతుంది అని చెప్పారు.
ఇందులో హీరోయిన్ దుర్గా పూజలో పోలీస్ ఆఫీసర్ అయిన సత్యకి , రాణా సిన్హా సహాయంతో భర్తను వెతుకుతుంది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోతుంది . చివర్లో అయితే చాలా ట్విస్టులు ఉంటాయి. చూస్తే మీకు నిజంగా మైండ్ బ్లాంక్ అవుతుంది. అయితే కహానీ సినిమాను కేవలం 8 కోట్లతో మాత్రమే తీశారు. కానీ ఇది
బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపి 104 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది కూడా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో తనకు తిరుగులేదు అని విద్యా బాలన్ నిరూపించుకుంది అనే చెప్పాలి. అయితే కహానీ సినిమా కోసం ఫస్ట్ ఛాయిస్ గా విద్యా బాలన్ కాదట
ఈ సినిమాను మన చంద్రముఖి అయిన జ్యోతికకు ఆఫర్ చేశారట. కానీ అందుకు ఆవిడ ఒప్పుకోలేదు. జ్యోతిక తర్వాత విద్యా బాలన్ కు ఆఫర్ వచ్చింది. కానీ ఆమె కూడా చేయడానికి రెడీగా లేదు. తర్వాత మొత్తం స్క్రిప్ట్ చదివిన తర్వాత సినిమా చేయడానికి ఒప్పుకుంది అని డైరెక్టర్ చెప్పారు. ఇక ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది
కహానీ సినిమాకు మొత్తం 28 అవార్డులు వచ్చాయి. ఇందులో 3 నేషనల్ అవార్డులు కూడా ఉన్నాయి. ఈ సినిమాను మన లైఫ్ ఈస్ బ్యూటఫుల్ డైరెక్టర్ అయిన కమ్ముల గారు తెలుగులో అనామిక పేరుతో తీశాడు. ఇది 2014 లో విడుదల అయింది. ఇందులో నయనతార మెయిన్ రోల్ చేసింది. ఇక ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రీగా ఉంది.
వెంటనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూసి ఎంజాయ్ చేయండి.more