Jr NTR Pan World Movie భారీ బడ్జెట్ గురూ 2025
నటీనటుల పారితోషికాలు, ఇంకా సాంకేతిక విలువలు పెరుగుతుండటంతో సినిమా నిర్మాణ కోసం అయ్యే వ్యయం రోజు రోజుకి పెరిగిపోతోంది. భారీగా స్టార్ క్యాస్టింగ్, సినిమాల్లో పాటల చిత్రీకరణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడంతో పాటు ఫారిన్‌లో షూటింగ్‌లు కలుపుకుంటే ఆ సినిమాకు బడ్జెట్ ఎక్కడినుంచి ఎక్కడికో వెళ్లిపోతోంది. ఇక పాన్ ఇండియా కల్చర్ మొదలయ్యాక సినిమాలకు హైప్ తీసుకొచ్చేందుకు వివిధ ఇండస్ట్రీలకు చెందిన వారిని తీసుకుంటున్నారు. అయితే ఇది నానాటికీ ఎక్కువ కావడంతో నిర్మాతల జేబులు ఖాళీ ఆవుతున్నాయి.

భారతీయ సినిమాలు అసలు 100 కోట్లు అయినా దాటుతాయా అని ఒకప్పుడు అనుకునేవారు కానీ ఇప్పుడు 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు కూడా దాటేసి హాలీవుడ్‌కు ఏమాత్రం భారతీయ సినిమాలు తగ్గేది లేదని నిరూపించాయి. మన దేశంలో హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత ప్రాంతీయ భాషలకు కూడా విస్తరించింది. హిందీ తర్వాత తెలుగు ,తమిళ్ చిత్ర సీమలు భారీ భారీ బడ్జెట్‌లకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. అయితే ఈ విషయంలో టాలీవుడ్ ( తెలుగు చిత్ర పరిశ్రమ ) ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. ప్రభాస్ బాహుబలి సిరీస్, కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్, పుష్ప 2, గేమ్ ఛేంజర్ వంటి సినిమాల బడ్జెట్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రభాస్ హీరో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్వరూపమే మారిపోయింది. మన మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియానే కాదు, ఏకంగా ఖండాంతరాలు దాటిపోయి కోట్ల కోట్ల వర్షం కురిపిస్తోంది. గతేడాది విడుదలైన ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ రూ.1200 కోట్లు, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఏకంగా 1900 కోట్ల వసూళ్లు సాధించాయి. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ భారీ చిత్రాల్లో పుష్ప 2, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీగా నిలవడం తెలుగు వాళ్లకు తెలుగు సినిమాకు గర్వకారణం. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ స్థాయి సినిమాలు రావడం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా రికార్డులను బద్ధలు కొట్టడం ఆ ఒక్క సినిమాకే ఉందని విశ్లేషకుల అభిప్రాయం. అదే SSMB 29.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటం అది కూడా సూపర్ స్టార్ట్ మహేశ్ బాబుతో కావడంతో ఈ సినిమాపై చిత్ర సీమలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ డే, టోటల్ కలెక్షన్స్‌పై ఇప్పటి నుంచే ఇండస్ట్రీ వర్గాలలో చర్చ మొదలైంది. ఈ సినిమా సులభంగా రూ.700 నుంచి రూ.1000 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందని మహేశ్ బాబు అభిమానులు ఇప్పటినుంచినే పందెలు కాసుకుంటున్నారు. ఈ సినిమా లాంగ్ రన్‌లో రూ.4000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేవలం తెలుగు సినిమాయే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమ నుంచే ఈ సినిమా తొలి పాన్ వరల్డ్ చిత్రంగా ఎస్ఎస్ఎంబీ 29 నిలవనుంది. ఇందులో నటి ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఒడిషాలో రాష్ట్రంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఎప్పడు విడుదలవుతుందో ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేని పరిస్ధితి . అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాజమౌళి – మహేష్ ఈ చిత్రం థియేటర్‌లలో రావడానికి కనీసం మూడేళ్ల నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని అంటున్నారు. అయితే ఈ లోపే మరోక్క తెలుగు చిత్రం తొలి పాన్ వరల్డ్ సినిమాగా నిలిచేందుకు వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. అది మరేదో కాదు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న డ్రాగన్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ సినిమా టాలీవుడ్ నుంచి తొలి పాన్ ఇండియా వరల్డ్ మూవీగా నిలుస్తుందని అందరూ అంచనా వేస్తుంది.

Jr NTR Pan World Movie
ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్లిన ఈ సినిమాలో కీలక సన్నివేశాలను ప్రశాంత్ నీల్ భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉండగా మైత్రీ అధినేతలలో ఒకరైన రవిశంకర్ చేసిన కామెంట్స్ ఈ సినిమా మీద మరింత అంచనాలు పెంచుతున్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్‌తో భారీగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎంత వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసేందుకు ప్రశాంత్ నీల్ షెడ్యూల్ ఈ పాటికే రూపొందిస్తున్నారు. ఆయన దూకుడు చూస్తుంటే ఇంక రెండేళ్ల లోగానే డ్రాగన్‌ను రిలీజ్ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రశాంత్ గత చిత్రాలు కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్‌లను ఆయన వేగంగానే పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29 తెలుగు నుంచి తొలి పాన్ వరల్డ్ సినిమా అని అనౌన్స్ చేశారు అయితే దీని విడుదలకు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా డ్రాగన్ తెలుగు నుంచి తొలి పాన్ వరల్డ్ సినిమాగా చరిత్రకెక్కనుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.3000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని నిర్మాతలు గట్టి పట్టుదలగా ఉన్నారు. మరి రాజమౌళి – ప్రశాంత్ నీల్ మధ్య జరిగే వార్‌లో ఎవరు ముందొస్తారో ఇంకా వేచి చూడాలి.more