నీతి అయోగ్ ఆర్థిక ప్రణాళికలో ముంబైతో పాటు మన విశాఖపట్టణం 30 ట్రిలియన్ డాలర్ల ఏకానమీ ఏ లక్ష్యం
ప్రస్తుతం భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నా 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను రచిస్తుంది. ఇందులో కొన్ని నగరాలు అయినా ముంబై, సూరత్, వారణాసి, వైజాగ్ నగరాలను ఆర్థికం గా పరివర్తనం చెందాలని ప్రణాళికలను సిద్ధం చేసినట్లు, ఇది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా చెందేందుకు సహాయ పడుతుంది అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం శనివారం తెలియచేశారు.
ఈ నీతి అయోగ్ లక్ష్యం 2047 అని ఆలోపు భారత్ 30 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మరెందుకు నీతి అయోగ్ పూర్తి ప్రణాళిక మరియు విజన్ డాక్యుమెంటరీ తయారు చేసింది. అయితే దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. మేము నగరాల అర్బన్ ప్రణాళికలను సిద్ధం చేశాము నీతి అయోగ్ ముంబై, వారణాసి, సూరత్, వైజాగ్ నగరాల ఆర్థిక పరివర్తన కోసం ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసింది అని ఢిల్లీ లో జరిగిన సమావేశంలో సుబ్రమణ్యం తెలియచేసారు.
గతయేదాది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నీతి అయోగ్ అధికారులతో సమావేశం అయ్యి ముంబాయి మెట్రోపాలిటన్ రీజియన్ ( ఏంఏంఆర్ ) జీడీపీనీ 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడానికి అవసరమైన అన్ని చర్చల గురించి చర్చించారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పూర్తిగా తీర్చిదిద్దేందుకు డిసెంబర్ 11న కేంద్ర ప్రభుత్వం మన దేశ యువత అభిప్రాయాన్ని కోరింది అని సుబ్రమణ్యం తెలియచేసారు. ఇప్పటివరకు మన దేశ యువత నుంచి 10 లక్షలకు పైగా వివరణాత్మక సూచనల్ని స్వీకరించమని వీటిని కృత్రిమ మేధస్సు అనగా ( AI ) యుపయోగించి ప్రాసెస్ చేస్తున్నామని తెలియచేసారు.