Good News: రేషన్ కార్డు holders కు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద, దిగువ మధ్య తరగతి వర్గాల వారి కోసం ఒక చారిత్రక నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది.

Telangana Government
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం ఒక పండగలాంటి విషయం చెప్పింది. ఉగాది నుంచి రేషన్ షాపులలో సన్నబియ్యం Distribution చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉగాది రోజు న హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉగాది రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ తర్వాత సన్నబియ్యం పంపిణీ నీ ప్రారంభిస్తారు.
అయితే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ఈ ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.తాము ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీని మటంపల్లిలో నే సీఎం రేవంత్‌రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం తగిన స్థల ఎంపికకు చర్యలు తీసుకున్నామని,త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పేద, దిగువ మధ్య తరగతి వర్గాల కోసం తీసుకున్న చారిత్రక నిర్ణయం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తామని ప్రకటించింది. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకొక్కరికీ 6 కిలోల చొప్పున అందజేస్తామని అయితే, ప్రస్తుతం చేస్తున్న దొడ్డు బియ్యం తినడానికి అనువుగా లేదు. రేషన్‌కార్డుదారుల్లో దాదాపు 85 శాతం మంది ఆ బియ్యాన్ని కిలోకు రూ.10 చొప్పున బయట మార్కెట్‌లో అమ్ముకుని, సన్న బియ్యం కొనుక్కుంటున్నారు. ఆ బియ్యాన్ని మరింతగా పాలిష్ చేసి, సన్న బియ్యంగా మార్చడం ద్వారా కొనుక్కుంటే వారు భారీగా లాభాలు పొందుతున్నారు.
అందుకే రేషన్‌కార్డుదారులకు దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఇస్తే.. నూటికి నూరు శాతం మంది తినడానికి అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అది కూడా ఉచితంగా ఇస్తే పేదలకు చాలా ఉపయోగకరంగా ఉండడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఆలోచన చేసింది.more