Gaami Movie telugu review & collections; Vishwaksen

Written by srikanth

Published on:

Gaami Movie telugu review & collections; Vishwaksen

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాను నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ గామి బాక్సాఫీస్ వద్ద మాములుగా కాదు భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ మహాశివరాత్రి కానుకగా రిలీజైన ఈ సినిమా టెక్నికల్ బ్రిల్లియెన్స్, విజువల్ వండర్‌గా రూపుదిద్దుకొన్న ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి చాలా మంచి స్పందన రావడం అందరికి తెలిసిందే. క్రిటిక్స్ మరియు సాధారణ ప్రేక్షకుల నుంచి మంచి సానుకూల స్పందన రావడంతో భారీ ఓపెనింగ్స్ ఈ చినేమాకు నమోదయ్యాయి. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.

హిమాలయ పర్వత శ్రేణుల్లో అస్సలు అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఈ సినిమాను భారీ ఖర్చుతో నిర్మించారు. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్ అనే బ్యానర్లపై నిర్మాత కార్తీక్ సబరీష్ నిర్మాణంలో కొత్త దర్శకుడు విద్యాధర్ రావు కగిత ఈ సినిమా ను సుమారుగా 24 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ 11 కోట్ల మేరకు జరిగి ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ గామి సినిమా 12 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ వద్ద తన జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రాప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ సినిమాను 600 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేయగా , ఇతర రాష్ట్రాల్లో 150 స్క్రీన్లకుపైగా, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

ఈ సినిమాను ఓక ఎమోషనల్ పాయింట్‌తో అందరిని థ్రిల్లింగ్ కి గురి చేసే అంశంతో రూపొందిన ఈ అడ్వెంచరస్ మూవీ రిలీజ్‌కు ముందు భారీ బజ్ క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తొలి రోజు ఈ సినిమా మంచి మెరుగైన ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా తొలి రోజు 45% నుంచి 50% శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో విశ్వక్ సేన్ కెరీర్‌లో ఇది ది బెస్ట్ కలెక్షన్లు నమోదు కావడానికి అవకాశం ఏర్పడింది. ఈ సినిమా రెండో రోజు కూడా స్ట్రాంగ్‌గా అంటే 40% శాతం ఆక్యుపెన్సీని రిజిస్టర్ చేసే అవకాశలు ఎక్కువ ఉన్నాయి.

ఈ గామి చిత్రం తొలి రోజు మాత్రం రికార్డు వసూళ్లను సాధించింది అనే చెప్పాలి. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో ప్రీమియర్లు, ఫస్ట్ డే కలెక్షన్లను చూస్తే సుమారుగా 300K అమెరికన్ డాలర్లు అంటే ఈ సినిమా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చిత్ర యూనిట్ తెలియ చేసింది. ఇక ఈ మూవీ మన తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 4.5 కోట్ల నికరంగా కలెక్ట్ చేసింది. దింతో ఈ సినిమా సుమారు 7 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లను, 9.07 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని చెప్పవచ్చు.

విశ్వక్ సేన్ మాస్ కమర్షియల్ సినిమాలు కూడా చేయగలడు, లవ్ స్టోరీస్ కూడా చేయగలడు. అంతే కాకుండా కొత్త కొత్త గా ప్రయోగాలు కూడా చేయగలడు.. విశ్వక్ సేన్ తన కెరీర్‌లో రకరకాల చిత్రాలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటి విశ్వక్ సేన్ తన కెరీర్ ప్రారంభంలోనే గామి కథకు ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమా తెరపైకి వచ్చేందుకు దారిదాపు ఆరేళ్లు సమయం పట్టింది. ఈ ఆరేళ్ల వారి ప్రయాణం గురించి చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లోనే చెబుతూనే వచ్చింది. టీజర్ మరియు ట్రైలర్‌తో అందరినీ ఆకట్టుకున్న గామి థియేటర్లోని ఆడియెన్స్‌ను ఎంత మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

గామి చిత్రం కథ

శంకర్ (విశ్వక్ సేన్) ఒక అఘోరా ఆశ్రమంలోనే ఉంటాడు. అతను ఎవరినైనా తాకినా, ఎవరైనా అతడ్ని తాకినా అస్సలు తట్టుకోలేడు. తన ఒళ్లంతా ఒక రకంగా మారుంది ఇది తనకు మహా దేవుడు అతనికి ఇచ్చిన శాపం అని అక్కడ ఉన్న అఘోరాలంతా కలిసి ఆశ్రమం నుంచి శంకర్ ను బయటకు వెళ్లగొట్టేస్తారు. ఇక పోతే తనకు ఇది శాపమా? లేదా పరిష్కరించుకోగలిగే సమస్యేనా? అని అనుకుంటూ తన సమస్య పరిష్కారం కోసం ప్రయాణిస్తుంటాడు. ఈ ప్రయాణంలో డాక్టర్ జాహ్నవి (చాందినీ చౌదరి) అతనికి తోడుగా ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా ద్రోణ పర్వతంలో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాలను పొందాలనీ వారు ప్రయత్నిస్తారు. అంతటితో అతనికి ఉన్న సమస్య పోతుందని శంకర్ ఆ సాహసానికి బయల్దేరుతాడు.

అయితే ఈ శంకర్‌కు పదే పదే ఓ బాలిక తన పేరు ఉమ (హారిక), సీటీ 333 (మహమ్మద్) వ్యక్తులు వారిని కాపాడమని వేడుకుంటున్నట్టుగా వారు పదే పదే అతనికి గుర్తుకు వస్తుంటారు? అసలు ఇంతకీ వారితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ శంకర్ ఆ మాలిపత్రాలను పొందుతాడా? శంకర్ తన సమస్య నుంచి తాను బయటపడతాడా? తాను తన సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టే క్రమంలో అతను చేసిన సాహసాలు ఏంటి? అన్నది మనం తెరపై చూడాల్సిందే.

Gaami Movie telugu review & collections; Vishwaksen

గామి కథను చెప్పుకోవడానికి చాలా క్లిష్టంగానే ఉంటుంది. కానీ మనకు మాత్రం చూడటానికి మూడు కథల్లా అనిపిస్తుంది. కానీ సినిమా లో అసలు మ్యాటర్ ఏంటన్నది చివరన తెలుస్తుంది. మరి కొంత మంది ఆ ట్విస్ట్ ఏంటి? ఇంతకీ అసలు జరిగింది ఏంటి? అన్నది ముందే సులభంగా ఊహించేయగలరు. అయితే ఈ గామి అన్నది ఓ వ్యక్తి జీవిత ప్రయాణంలా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు చాలా స్లోగా, నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే అంతా ఎంతో ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. మూడు కథలను ముక్కలు ముక్కలు చూపిస్తూ చాలా నీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. అయితే సినిమా లో ఇంటర్వెల్ కార్డ్ మాత్రం చాలా అంటే చాలా సింపుల్‌గా పడేసినట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో ఊపు మీదున్న సినిమా చూసే ప్రేక్షకుడికి ఆ ఇంటర్వెల్ కార్డ్, ఆ సీన్ అంతగా రుచించకపోవచ్చు.

ఈ గామి కథకు ఓ పర్టిక్యులర్ పీరియడ్ కానీ ప్లేస్ అంటూ ఏమీ అంతగా తీసుకోలేదు దర్శకుడు. చూస్తుంటే ఇది 80వ దశకంలో కథ అని సింపుల్ గా అనుకోవచ్చు. దేవదాసి యొక్క వ్యవస్థ ఎలా ఉంటుందో, ఆ వ్యవస్థను ఈ సినిమా లో పరోక్షంగా విమర్శించినట్టు చూపించాడు. పార్టులు పార్టులుగా ఈ సినిమా కథను డివైడ్ చేసి దర్శకుడు చూపించాడు కాబట్టి కాస్త ముందుకు వెళ్తాం మళ్లీ వెనక్కి వస్తాము. అయితే కథలో మాత్రం ఫ్లో ఏ మాత్రం మిస్ అవ్వదు ఈ మూడు కథల్లో నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో ఇంటర్వెల్ వరకు దర్శకుడు అలా మెయింటైన్ చేస్తూ వస్తాడు.

ద్వితీయార్దంలోకి మనం వచ్చే సరికి కథ మొత్తం అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే తెరపై హిమాలయాలు, త్రివేణి సంగమం, ద్రోణ పర్వతం అంటూ చూపించిన విజువల్స్ మాత్రం చూడటానికి చాలా బాగున్నాయి. కొన్ని సార్లు అయితే అది మనకు రియల్ లొకేషన్ అనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు అయితే అవి వీఎఫ్ఎక్స్ అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ తెరపైన మాత్రం చూడటానికి ఓ విజువల్ ట్రీట్‌లా మనకు అనిపిస్తుంది. ఇక సినిమా లో ఒక సీన్ లో సింహం వస్తు ఆది కూడా చూడటానికి చాలా బాగుంటుంది.

ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎమోషన్స్, నటీనటుల యాక్టింగ్ మీద మాత్రమే ప్రేక్షకుడు ఫోకస్ పెడితే. సినిమా సెకండాఫ్‌లో టెక్నికల్‌ టీం చేసిన పనితనానికి అందరూ ఫిదా అవుతారూ. మరి క్లైమాక్స్‌ను చాలా నీట్‌గా, చాలా ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా సినిమాను ముగించేశాడనిపిస్తుంది. సినిమా హీరో ఇంకా ఏదైనా చేస్తా బాగుడు అని ఆశించే వారు కూడా ఉంటారు. కానీ దర్శకుడు మాత్రం ఈ కథను కేవలం శంకర్ కోణంలోంచి, అతని సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవడం అనే మార్గం లో తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. కొన్ని కొన్ని లాజిక్స్ వదిలేసి అలా కాసేపు స్లోగా సాగే కథను మనం భరించగలిగేతే గామి అనే అద్భుతాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు.

Gaami Movie telugu review & collections; Vishwaksen

టెక్నికల్‌గా ఈ చిత్రం కచ్చితంగా హై స్టాండర్డ్‌లోనే నిలుస్తుంది. ఈ సినిమాకి ఇలాంటి ఓ కొత్త టీం ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత గొప్ప అవుట్ పుట్ ఎలా తీసుకొచ్చింది అని అందరూ షాక్ అవ్వాల్సిందే. సినిమా ల్లోని విజువల్స్ మాత్రం ఎంతో సహజంగా అనిపిస్తాయి. చిత్రం లో హిమాలయాలను మనం దగ్గర నుంచి చూసినట్టుగా అనిపిస్తుంది. ఇక పాటలు, ఆర్ఆర్ మూడ్‌కు తగ్గట్టుగా ఆడియెన్స్‌ను ఎంతగానో ఎంగేజ్ చేస్తాయి. మరి మాటలు విషయానికి వొస్తే కొన్ని చోట్ల గుండెల్ని తాకుతాయి. ఇక ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మ్ంట్ ఇలా అన్నీ అద్భుతంగా వారు వారు తమ పనితనాన్ని చూపించాయి.

అయితే అఘోర పాత్రలో విశ్వక్ సేన్ చాలా అద్భుతంగా కనిపించాడు. ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించదు. తన స్టైల్‌కు భిన్నంగా నటించి అందర్నీ మెప్పించాడు. మరి చాందినీ చౌదరి సైతం రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌లా ఈ సినిమా లో కనిపించదు. ఈ చిత్రానికి ఆమె పడ్డ కష్టం మనకు తెరపై కనిపిస్తుంది. దేవదాసి దుర్గగా అభినయ తన నటన చాలా బాగుంది. హారిక, మహహ్మద్, దయానంద్, మయాంక్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ప్రేక్షకుల్ని చాలా మంచిగా ఆకట్టుకుంటారు.more

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Sreekanth Maravindla, I am the Writer and Founder of this blog and share all the information related Trending News , Local News, Movie Updates, Politics, Health Tips, Job Opportunities and Technology through this website.

Leave a Comment