Donald Trump and Melania Trump’s love story ; ట్రంప్ ప్రేమ కథ
ప్రేమ అనేది ఎప్పుడైనా.. ఎవరిమీదైన.. ఎలా అయినా పుడుతుంది. దానికి తారతమ్యాలుండవు, ఆస్తిపాస్తులు చూడదు, ఈ భూమి మీద ప్రేమకు ఎవరు అతీతులు కాదు. కాలం రాసిన చందమామ లాంటి ప్రేమ కథలును మనం ఇప్పటివరకు ఎన్నో వెండితెరపైన, బుల్లితెరమీద, మన చుట్టుపక్కల తరచు చూస్తూనే ఉంటాం. ప్రేమించే వ్యక్తి తమ వెంటుంటే అదో బలం, ఎంత పెద్ద యుద్ధానైనా గెలుస్తాం. ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు ఇప్పటికే మనం చాలానే చూశాం. కానీ ఇప్పుడు మనం ప్రపంచంలో అగ్రరాజ్యానికి అధిపతైన ట్రంప్ ప్రేమాయణం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

తొలిచూపులోనే ప్రేమ !
1998 లో తొలిసారి డొనాల్డ్ ట్రంప్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ను ఫీల్ అయ్యారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో తొలిసారిగా అక్కడ మెలనియాను చూశాడు. మెలనియా ఆమె ఒక గ్లామర్ మోడల్ 28 ఏళ్ల మెలనియాను చూసేటప్పటికి డొనాల్డ్ ట్రంప్ వయసు 52 ఏళ్లు.. వీరిద్దరి మద్య ఉన్న 24 ఏళ్ల తేడాను ట్రంప్ ఏమాత్రం పట్టింhచుకోలేదు. ట్రంప్ అప్పటికే ఒక పెద్ద వ్యాపారవెత్త, టెలివిజన్ స్టార్. అప్పటికే తన వైవాహిక జీవితంలో చాలా గొడవలు జరుగుతున్న కష్టమైన సమయం అది. తన ప్రెండ్స్ ద్వారా ఆ అమ్మాయి వివరాలును ట్రాంప్ తెలుసుకున్నాడు వారు తన గురించి తెలుసుకొని స్లొవేనియా మోడల్ అని వారు చెప్పారు.
ఆమె నంబర్ కోసం.. నానా తిప్పలు…
ప్రేమలో ఎవరికైన సరే హనుమంతుడి మాదిరి అన్నిట్లో తోడుండి జంట చేసేది స్నేహితులే కదా. ఆ అమ్మాయి రెండేళ్ల క్రితమే తన ఫ్యామిలీతో పాటు ఇక్కడకి వచ్చిందని పూర్తి వివరాలు అందజేశారు. అంతే ఇక ట్రంప్ ఇంకా అలా అల్లుకుపోయాడు. ఆమెతో పరిచయం చేసుకున్నాడు ఆమె ఫోన్ నెంబర్ అడిగాడు పాపం మెలనియా ఇవ్వలేదు! అతడి పక్కనే సెలీనా మిడెల్ఫార్ట్ అనే మరో అమ్మాయి ఉంది. అక్కడ ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని మరో అమ్మాయి ఫోన్ నెంబర్ అడుగుతాడేంటి అని కోపం వచ్చి నెంబర్ ఇవ్వలేదు. కానీ ట్రంప్ గురించి తెలిసిందేగా పట్టు వదలని విక్రమార్కుడిలా నంబర్ కోసం ట్రై చేశారు.
ట్రంప్ 25 ఏళ్ల కుర్రాడి మాదిరి మెలనియా ఎక్కడికి వెళితే అక్కడ ఆయన ప్రత్యక్షమయ్యే వాడు. ఆమెని ఎలా అయినా ఇంప్రస్ చేయడానికి శతవిధాల ప్రయత్నించి చివరికి ఆమెను ప్రేమలో పడేశారు. ఇంకేముంది ఇక ప్రేమ స్టార్ అయింది ఆ తరువాత ప్రేమంటేనే గొడవలు, బుజ్జగింపులు, బ్రేకప్‌లు, ప్యాచప్‌లు, ఇలా సాగిన వారిద్దరి ప్రేమాయణం ఫస్ట్ టైమ్ ‘హెూవార్డ్ స్టెర్న్ టీవీ షో’ సాక్షిగా ప్రపంచానికి తెలిసింది. “మా మధ్య ఎటువంటి గొడవలు ఉండవు. మా గురించి ప్రపంచం గొడవలు పెట్టుకోవడం తప్ప” అన్నారు. 2005లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా 2006లో మెలనియా తల్లి అయింది వారికి కొడుకు పుట్టాడు.
మెలనియాకు 2005 లో ఆమెకు అమెరికన్ సిటిజన్ షిప్ దక్కింది. మెలనియా డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి ఫ్యాషన్ మోడలింగ్ కి వచ్చేశారు. మెలినియాకు చాలా భాషలు మాట్లాడటం వచ్చు ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, స్లొవేనియా, సెర్బియా భాషలు ఆమె మాట్లడతారు. 2016 లో ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు బాగా ఎక్కువయ్యాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మహిళల పట్ల ట్రంప్ ఎంత అసభ్యంగా ప్రవర్తించారన్నది మీడియాల్లో ప్రసారం అవ్వడం మొదలయ్యాయి. భర్తను ఓడించడానికి సాటి మహిళలు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడానికి ఆమెకు వచ్చిన భాషలేవి సరిపోలేదు. కుంగిపోకుండా.. భర్తపై వచ్చిన ఆరోపణలు నమ్మి ట్రంప్ ను వదలకుండా.. పతి వెంటే నిలిచారు. గెలిపించారు. ఇవాంకపై వస్తున్న వార్తలను సైతం తల్లి స్థానంలో ఉండి ఖండించారు. కన్న తల్లి కాకపోయినా.. తల్లి స్థానంలో ఉన్నాను కాబట్టి.. వారి గురించి నేను తప్పక ఆలోచిస్తా అని చెప్పుకొచ్చారు.more