BRS MLA Lasya Nanditha Killed in Car Accident
కంటోన్మెంట్ ఎమ్మెల్యే Lasya Nanditha ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు. లాస్య నందిత ప్రయానం చేస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను వేగంగా ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే ఎమ్మెల్యే నందిత ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె ఇటీవల వరుసగా చాలా ప్రమాదాలకు గురయ్యారు మృత్యువు ఆమెను వెంటాడుతోందా అన్నట్లుగా వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటూ వొచ్చాయి.

అయితే ఈ రోడ్డు ప్ప్రమాదం ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత గారి తలకు పెద్ద గాయాలు అయ్యయి. ఈ ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యే లాస్య నందిత తో పాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్‌మెన్‌లు కూడా ఉన్నారు. అంతే కాదు గతేడాది ఫిబ్రవరి నెలలోనే ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న కూడా మృతి చెందారు. ఇప్పుడు కుమార్తె ఎమ్మెల్యే లాస్య నందిత కూడా దుర్మరణం పాలయ్యారు.
వెంటాడిన మృత్యువు
రెండు నెలల క్రితం సికింద్రాబాద్‌లో ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే లాస్య నందిత వెల్లిండ్ అక్కడ ఆమె ఎక్కిన లిఫ్ట్ ఓవర్‌లోడ్ అవ్వడం కారణంగా సడెన్‌గా ఆ లిఫ్ట్ కిందకి వెళ్లిపోయింది దాంతో లాస్య నందిత లిఫ్ట్‌లోనే అక్కడే ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యే యొక్క వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమై లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్తి రక్షించారు. దాంతో ఎమ్మెల్యే లాస్య నందిత సురక్షితంగా ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు వచ్చారు. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఆమెకు మెుదటి ప్రమాదం.
మళ్లీ పది రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో ఒక బహిరంగ సభను నిర్వహించింది. ఆ సభకు హాజరైన ఎమ్మెల్యే లాస్య నందిత తన కారులో మళ్లీ హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యారు. ఆ ప్రయాణం లో క్నార్కట్‌పల్లి వద్దకు రాగానే ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది ఆ రహదారి పక్కన వేగంగా రెయిలింగ్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారు లో ఉన్న హోంగార్డు ప్రమాణాలు అక్కడే కోల్పోయాడు. అయితే ఎమ్మెల్యే లాస్య నందిత, ఆమె పీఏ స్వల్పగాయాలతో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
అయితే ఈ మూడోసారి జరిగిన ప్రమాదంలో ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేక పోయారు. ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు నల్గొండలో ప్రమాదానికి గురి అయిన ఆ కారే ఇవాళ కూడా ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయిన ఆమె కారు రోడ్డు డివైడర్‌ను వేగంగా ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయింది. ఇలా ఆమెను చాలాసార్లు మృత్యువు వెంటడగా ఈసారి తప్పించుకోలేక అక్కడే కన్నుమూసింది.
ఎమ్మెల్యే గా లాస్య నందిత
ఈ లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న గారి పెద్ద కుమార్తె. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న ఆకస్మికంగా మరణించడు దాంతో ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం ఘన సాధించారు. ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టి ప్రయత్నాలే చేసినా కూడా కేసీఆర్ మాత్రం నందితపై నమ్మకం ఉంచారు. 2016లో కవాడిగూడ నుంచి లాస్య నందిత కార్పొరేటర్‌గా తన రాజకీయ జీవితం ప్రారంభించారు.

లాస్య నందిత 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఆమె ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తన తండ్రి సాయన్న వెంటే ఉంటూ తన నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. అయితే తన తండ్రి మరణం తర్వాత బీఆర్ఎస్ టికెట్ కేటాయించటంతో ఇటీవల ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ అంతలోనే ఆమె ప్రాణాలు కోల్పోవంటం అందరికి అంతులేని విషాదాన్ని నింపింది.
ప్రమాదానికి కారణాలు ఏంటి ?
ఆ ప్రమాద స్థలంలో ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎమ్మెల్యే యొక్క కారు నడిపిన డ్రైవర్‌ను పోలీసులు పలు విషయాలపై ప్రశ్నలు సంధించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అయితే ‘ఈ ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియదు నాకు అసలు ఏమి గుర్తే లేదు’ అని కారు నడిపిన డ్రైవర్ చెబుతున్నాడని పోలీసులు మీడియాకు తెలియ చేసారు. ఇవి మాత్రమే కాదు ఎన్ని సార్లు అడిగినాఎన్ని ప్రశ్నలు అడిగినా పదే పదే నాకు ఏమీ తెలియదనే విషయాన్నే చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం కారు నడిపిన డ్రైవర్‌కు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుండగా సాయంత్రం, రేపు ఉదయం మరోసారి అతన్ని మళ్లీ విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తే అతివేగానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలియవచ్చింది.

అంతే కాకుండా కారు వేగంగా వెళ్తుండటంతో ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రెయిలింగ్‌ను ఢీ కొట్టి ఉండొచ్చు అని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు కావడాన్ని బట్టి చూస్తే కచ్చితంగా అక్కడ ఏదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా, ఎడమవైపు ఉన్న ముందు చక్రం సైతం పూర్తిగా ధ్వంసమైంది. ఆ కారు యొక్క మీటర్ బోర్డ్ 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే లాస్య నందిత కారు బ్యానెట్ పై భాగంలో అంటుకొని ఉన్న రెడీ మిక్స్ సిమెంట్ క్లూస్‌ను కూడా పోలీసు వారు సేకరించారు.
అయితే మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్‌ను ఢీ కొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని చాలామంది నిపుణులు అంటున్నారు. అందుకే ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కార్ల రక్షణపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లక్షలు లక్షలు పెట్టి కొన్న కార్లు చిన్న చిన్న ప్రమాదాలతో ప్రాణాలు పోతున్నాయని ఆవేదన నెటిజన్లు వెలిబుచ్చుతున్నారు. మరి కొన్ని