Bank of Baroda Banking Jobs నిరుద్యోగులకు శుభవార్త
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం చెప్పవచ్చు. మన అందరికీ తెలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా అనేక పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ jobs కోసం అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 146 బ్యాంకింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల మార్చి 2025 నుండి ప్రారంభమైంది మరియు చివరి తేదీ 15 ఏప్రిల్ 2025 గా నిర్ణయించబడింది ఆసక్తి ఉన్నవాళ్ళు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం 146 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకునే వారందరికీ ఇదొక సువర్ణావకాశంగా చెప్పవచ్చు. దిగ్గజ బ్యాంకింగ్ వ్యవస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా అనేక పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మన అందరికీ తెలిసిందే బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఇది కూడా ఒకటి. ఈ బ్యాంకు దేశవ్యాప్తంగా విస్తృతమైన శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది . దేశంలో లక్షలాది మంది వినియోగదారులకు ఈ బ్యాంకు సేవలను అందిస్తోంది. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు 2025 సంవత్సరానికి వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆన్లైన్ లో విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 146 బ్యాంకుకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు బ్యాంకుకు సంబంధించిన వివిధ కేటగిరీలలో ఉన్నాయి . అర్హత బ్యాంకింగ్ మీద ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఖాళీగా ఉన్న పోస్టుల పూర్తి వివరాలు
డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (DDBA) Deputy Defense Banking Adviser 1 పోస్టు, ప్రైవేట్ బ్యాంకర్ (రేడియన్స్ ప్రైవేట్) 3 పోస్టులు, గ్రూప్ హెడ్ – 4 పోస్టులు, టెరిటరీ హెడ్ – 17 పోస్టులుగా ఉన్నాయి. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ 101 పోస్టులు, వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్‌మెంట్ మరియు ఇన్సూరెన్స్) 18 పోస్టులు, ప్రొడక్ట్ హెడ్ (ప్రైవేట్ బ్యాంకింగ్) – 1 పోస్టు, పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ – 1 పోస్టు, ఈ పోస్టులు బ్యాంకింగ్ రంగంలో మంచి కెరీర్‌ను ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతిష్టాత్మకమైన సంస్థ అని అందరికీ తెలుసు, ఇక్కడ పనిచేయడం వలన వృత్తిపరమైన అభివృద్ధికి మరెన్నో అనేక అవకాశాలు ఉంటాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు 2025: కావలసిన అర్హతలు
ఇందులో వివిధ పోస్టులకు అవసరమైన విద్యార్హతలు , వయో పరిమితికి సంబంధించిన మరింత వివరణాత్మక సమాచారం కోసం, అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల విడుదల చేసిన వారి అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలిసి ఉంటుంది. నోటిఫికేషన్‌లో ప్రతి పోస్టుకు సంబంధించిన అర్హతలు, అనుభవం ఇంకా ఇతర ముఖ్యమైన వివరాలు అందులో స్పష్టంగా ఇవ్వబడ్డాయి. అయితే అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా వివరంగా చదవడం చాలా ముఖ్యం.
సాధారణంగా, ఇటువంటి పోస్టులకు దరఖాస్తు చేయడానికి గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు సంబంధిత రంగంలో అనుభవం చాలా అవసరం. కొన్ని పోస్టులకు నిర్దిష్ట విద్యార్హతలు లేదా కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు కూడా చాలా అవసరం. అంతే కాకుండా వయో పరిమితి పోస్టును బట్టి కూడా మారుతుంది . ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు సడలింపులు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది
Bank of Baroda Banking Jobs
ఇందులో అభ్యర్థుల ఎంపిక షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియ వ్యక్తిగత ఇంటర్వ్యూ (PI) ఆధారంగా జరుగుతుంది. ఇంకా అవసరమైతే ఇతర ఎంపిక ప్రక్రియలను కూడా ఉపయోగించవచ్చు. ఇంటర్వ్యూ లేదా ఇతర ఎంపిక ప్రక్రియలో కనీస అర్హత మార్కులను ఎంత ఉండాలి అని బ్యాంకు నిర్ణయిస్తుంది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా చాలా పారదర్శకంగా , ఇంకా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఇందులో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు . చివరి అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలో వారి పనితీరు ఆధారంగా ఉంటుంది.
అయితే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కేవలం ప్రతిభావంతులైన మరియు నైపుణ్యం కలిగిన అభ్యర్థులను నియమించుకోవడానికి కట్టుబడి ఉంది. ఇందులో ఎంపిక ప్రక్రియ అభ్యర్థుల సామర్థ్యాలను మరియు బ్యాంకింగ్ రంగానికి వారి అనుకూలతను అంచనా వేయడానికి ఇది రూపొందించబడింది.
దరఖాస్తు రుసుము ఎంత ?
ఇందులో అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు రుసుము కూడా చెల్లించవలసి ఉంటుంది. జనరల్, EWS మరియు OBC కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 600 గా నిర్ణయించబడింది. అయితే SC, ST, PWD, మహిళా అభ్యర్థులకు ఈ రుసుము కేవలం రూ. 100. అయితే అభ్యర్థులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా కూడా రుసుము చెల్లించవచ్చు. ఇందులో ఆన్‌లైన్ చెల్లింపు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అభ్యర్థులు సులభంగా రుసుము చెల్లించవచ్చు. అయితే రుసుము చెల్లించని దరఖాస్తులు తిరస్కరించబడతాయి. కాబట్టి, అభ్యర్థులు నిర్ణీత గడువులోపు రుసుము చెల్లించాలని సూచించబడింది.
గమనిక : మరింత సమాచారం , నోటిఫికేషన్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌ను bankofbaroda.in ని సందర్శించండి. more