Article 370 Movie Telugu Review
Article 370 ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది అలా రిలీజ్ అయ్యిందో లేదో పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాను చూసిన తరువాత ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద చాలా పాజిటివ్ గా స్పందించడం నిజంగా చాలా ఆసక్తికరమైన విషయమనే చెప్పాలి.
Article 370 Movie Telugu Review
ఈమధ్య కాలంలో వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని తీసిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి అనే చెప్పాలి. అందులో భాగంగానే ‘ఆర్టికల్ 370 రద్దు ‘ ను అధారంగా చేసుకొని తీసిన ఈ ఆర్టికల్ 370 సినిమా ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ Yami Gautam, Priyamani, Arun Govil లు ముఖ్యపాత్రలు పోషించారు. అంతే కాకండా ఈ సినిమా కి నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ‘ఆదిత్య సుహస్ ‘ డైరెక్టర్ గా వ్యవహరించాడు.
ఇక పోతే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద చాలా పాజిటివ్ గా స్పందించడం బాగుంది అని చెప్పడం నిజంగా చాలా ఆసక్తికరమైన విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమాను చూసిన ఒక్కొక్క ప్రేక్షకుడు ఆ సినిమా చూస్తున్న టైం లో వారు ఒక డిఫరెంట్ అనుభూతి పొందితిమి అని చెప్పడమే కాకుండా చాలా వైవిధ్యంగా వారి వారి ఈ సినిమా మీద అనుభవాలను వివరిస్తున్నారు.
ఇక ట్విట్టర్ వేదికగా కెనడా నుంచి ఒక వ్యక్తి ఈ సినిమాను చూసాను అని ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆయన పొందిన అనుభూతిని గురించి తెలియజేశాడు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన యామి గౌతమ్ , ప్రియమణి, అరుణ్ గోవిల్ నటన చాలా చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా థియేటర్లో చూస్తున్నంత సేపే కాకుండా, సినిమా అయిపోయిన తర్వాత మనం మన ఇంటికి వెళ్ళినా కూడా మనల్ని ఆ క్యారెక్టర్లు వెంటాడుతూనే ఉంటాయని అలాంటి ఒక గొప్ప సినిమాని దర్శకుడు మలిచాడు అంటూ తను ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నాడు.
ఇకపోతే ఈ సినిమా కోసం ఆదిత్య సుహాస్ రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా చాలా బాగుందని. సినిమా చివరి వరకు ప్రేక్షకులను చాలా ఉత్కంఠకు గురి చేస్తూనే ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా సినిమా అలా సాగుతూ ఉంటుంది అంటూ ఆయన తెలియజేయడం విశేషం గా చెప్పాలి.
అయితే ట్రేడ్ అనలిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న ‘సుమిత్ కాడెల్’ ఎక్స్ ( ట్విట్టర్ )లో ఈ సినిమా గురించి ఆయన ఇలా రాసుకోచ్చాడు. ఈ సినిమా టాప్ నాచ్ పొలిటిక్రిటికల్లి మన దేశం లోని జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు ను చాలా గొప్పగా చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ని ఇండియాలో ఒక భాగంగా చేయడాన్ని చాలా స్పష్టంగా చూపించారు. అలాగే ఈ సినిమా దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. దాంతో ఈ సినిమా ఎక్కడ కూడా ఎవ్వరికీ బోర్ లేకుండా వాస్తవికతని తెలియజేస్తూ అలా సాగింది.అలాగే చిత్రంలో భయంకరమైన తీవ్రవాది అయిన బుర్హాన్ వనీని హతమార్చడం, పూల్వమా దాడుల గురించి చాలా అర్థవంతంగా కవర్ చేస్తూ వాస్తవికతని తెలియజేయడానికి దర్శకుడు ఒక గొప్ప ప్రయత్నం చేశారు అంటూ తను ట్విట్టర్ వేదికగా ఆయన రాసుకోచ్చాడు
Article 370 Movie Telugu Trailer
Article 370 అంటే ఏంటి
గత కొద్ది ఏళ్లగా జమ్మూ కశ్మీర్లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో బలగాలను జమ్ము కశ్మీర్లో మోహరించింది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్ సందర్శించడానికి వచ్చిన యాత్రికులు, పర్యాటకులను వెనక్కి పంపించేశారు. ఎందుకు అంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Article 370 గురించి కొన్ని ముఖ్య విషయాలు
- ఈ జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఆ నాటి భారత ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370 ఏర్పాటు చేసింది. ఈ ఆర్టికల్ ప్రకారం మన రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన అన్ని నిబంధనలేవీ ఈ జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు. దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం కి బదులుగా ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు.
- ఆర్టికల్ 370 పట్ల మన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
- ఈ 370 ఆర్టికల్‌ను గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు ఈయన అంతకు ముందు జమ్మూ కశ్మీర్ యొక్క రాజు అయినా మహారాజా హరి సింగ్ వద్ద దివాన్‌గా పని చేశారు.
- దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల యొక్క వ్యవహారాలు మినహా మరి మిగిలిన అన్ని చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.
- ఆర్టికల్ 370 ప్రకారం బయటి వ్యక్తులు జమ్మూ కశ్మీర్లో భూములను లేదా ఆస్తులు కొనుగోలు చేయడం ఇక్కడ కుదరదు.
- యుద్ధం సమయం , విదేశీ దురాక్రమణ సమయంలోనే కేంద్రం ఆయా రాష్ట్రాలలో ఎమర్జెన్సీ విధించగలదు. రాష్ట్రం లో అంతర్గత ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేనిదే ఎమర్జెన్సీ విధించలేం.
- ఈ జమ్మూ కశ్మీర్‌కు అన్ని రాష్ట్రాలు లా కాకుండా ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి.
- ఈ రాష్ట్రం లోని రాష్ట ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.
- * అయితే ఈ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి మాత్రం ఆరేళ్లు.
అందుకే ఇటువంటి జరిగిన లేదా జరుగుతున్న నిజమైన సంఘటనల గురించి సినిమాలు తీస్తుంటే సినిమాలు విజయవంతం ఔతున్నాయి. ఎందుకు అంటే ఆ సంఘట గురించి జనాలకు బాగా తెలిసి ఉండటం లేదా ఆ సంఘటన గురించి ఆసక్తి ఉండటని దర్శకులు సినిమాలు గా రూపొందించి విడుదల చేసి కాసుల వర్షలను కురుపిస్తున్నారు. ఈ చిత్రం గురించి మీకు ఏమి అనిపించిందో మీ కామెంట్స్ నీ మాకు తెలియ చేయండి. మరికొన్ని…for more