AP Work from Home Jobs ; చంద్రబాబు కీలక ఆదేశాలు
అవును అంది ఇక నుంచి ఏపీలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పనిచేసుకునే విధానం) ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే సచివాలయ ఉద్యోగులతో క్షేత్రస్ధాయిలో సర్వే చేయిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ మొత్తం 2.68 కోట్ల మందిని సర్వే చేయాలని లక్షంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇందులో ఇప్పటికే 82 లక్షల మంది అభిప్రాయాలును తీసుకుంది. వీటి ఆధారంగానే ఈరోజు సీఎం చంద్రబాబు అధికారులకు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం జాబ్స్ ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం చంద్రబాబు గారు తెలిపారు. వర్క్ ఫ్రం హోం జాబ్స్ తో పాటు నైబర్ హుడ్ వర్కింగ్, కో వర్కింగ్ విధానాలపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ఇంటి నుంచే పని చేసే విధానంలో వసతులు, అవకాశాలు కల్పించడం, శిక్షణ అందించడం ద్వారా పెద్ద ఎత్తున అవకాశలు సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుని ఉందన్నారు. అయితే ఇందులో భాగంగానే ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వర్క్ ఫ్రం హోంపై సర్వే నిర్వహిస్తున్నారని, 2.68 కోట్ల మందిని సర్వే చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.
అయితే ఇందులో ఇప్పటి వరకు 82.06 లక్షల మందిని సర్వే చేశారన్నారు. వీరిలో 1.72 లక్షల మంది వర్క్ ఫ్రం హోం జాబ్స్ విధానంలో పని చేస్తున్నట్లు వివరించారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నా..తమకు తగిన అవకాశాలు లేవని..అందువల్ల అటువంటి ఉపాధి కల్పిస్తే తాము కూడా వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తామని 20.43 లక్షల మంది చెప్పినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
సర్వే చేసిన వారిలో ఇంటర్ కంటే తక్కువ చదివిన వారు 9.05 లక్షల మంది ఉండగా, డిప్లొమా, ఆపై చదువులు చదివిన వారు 10.73 లక్షల మంది ఉన్నారనీ, ప్రస్తుతం ఆయా గ్రామాల్లో వర్క్ ఫ్రం హోం సెంటర్లు, పని స్టేషన్ సెంటర్‌ల ఏర్పాటుకు ఉన్న భవనాలపైనా సర్వే నిర్వహిస్తున్నారు. ఇందుకు తగిన విద్యార్హతలు ఉండి, పని చేసే సామర్థం ఉన్నవారికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశాలు కల్పించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడాలని సీఎం అధికారులకు సూచించారు.
అయితే ఇక నుంచి ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరే తమ క్వాలిఫికేషన్ కి తగ్గ వర్క్ హోం జాబ్స్ చేస్కుంటూ సంపాదించొచ్చు.more