AP Assembly Election: TDP & Jana Sena announce first joint list of 118 seats

Written by srikanth

Published on:

AP Assembly Election: TDP & Jana Sena announce first joint list of 118 seats

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి కలసి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ గురించి ఊసు లేకుండా 118 స్థానాలకు రెండు పార్టీలు పోటీ ఈ ఎన్నికల్లో చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు యొక్క నివాసంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఈ ప్రకటన చేశారు.

రెండు పార్టీల పొత్తులో భాగంగా జనసేన పార్టీ కు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్‌సభ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు.  అంతే కాకుండా టీడీపీ తరఫున పోటీ చేసే 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు ఈ రోజు విడుదల చేశారు. అయితే జనసేన తరపున 24 సెగ్మెంట్లకుగానూ కేవలం ఐదు స్థానాలకు మాత్రం ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు‌.

ఇక ప్రకటన చేసే సమయంలో బీజేపీ ప్రస్తావన రాగా ఇరువురూ తలో మాట చెప్పడం గమనార్హం. మా ఇరు పార్టీల పొత్తుకు బీజేపీ శుభాసీస్సులు ఉన్నాయని పవన్‌ కల్యాణ్‌ పేర్కొనగా. ప్రస్తుతానికి అయితే టీడీపీ మరియు జనసేనల పొత్తు మాత్రం ఖరారు అయ్యింది. పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు బీజేపీ మాతో కలిసి వస్తే అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తాం ఇప్పటికైతే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాం’’ అని చంద్రబాబు చెప్పారు.
తొలి జాబితా సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ సీనియర్లకు షాకిచ్చాడు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఉన్న బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావుకి హ్యాండిచ్చాడు. అటు గంటా శ్రీనివాసరావుకు కూడా జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం.

టీడీపీ ప్రకటించిన అభ్యర్థులు వీరే

ఇచ్ఛాపురంబెందాళం అశోక్‌
టెక్కలిఅచ్చెన్నాయుడు
ఆమదాలవలసకూన రవికుమార్‌
రాజాంకోండ్రు మురళి
కురుపాంతొయ్యక జగదీశ్వరి
పార్వతీపురంవిజయ్‌ బోనెల
సాలూరుగుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలిఆర్‌ఎస్‌వీకేకే రంగారావు(బేబీ నాయన)
గజపతినగరంకొండపల్లి శ్రీనివాస్‌
విజయనగరంఅదితి గజపతిరాజు
విశాఖ ఈస్ట్‌వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖ వెస్ట్‌పీజీవీఆర్‌ నాయుడు
అరకుసియ్యారి దొన్ను దొర
పాయకరావుపేటవంగలపూడి అనిత
నర్సీపట్నంచింతకాయల అయ్యన్నపాత్రుడు
తునియనమల దివ్య
పెద్దాపురంనిమ్మకాయల చినరాజప్ప
అనపర్తినల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి
ముమ్మిడివరందాట్ల సుబ్బరాజు
పి.గన్నవరంరాజేశ్‌ కుమార్‌
కొత్తపేటబండారు సత్యానంద రావు
మండపేటజోగేశ్వరరావు
రాజమండ్రి సిటీఆదిరెడ్డి వాసు
జగ్గంపేటజ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
ఆచంటపితాని సత్యనారాయణ
పాలకొల్లునిమ్మల రామానాయుడు
ఉండిమంతెన రామరాజు
తణుకుఅరిమిల్లి రాధాకృష్ణ
ఏలూరుబాదెటి రాధాకృష్ణ
చింతలపూడిసోంగ రోషన్‌
తిరువూరుకొలికపూడి శ్రీనివాస్‌
నూజివీడుకొలుసు పార్థసారథి
గన్నవరంయార్లగడ్డ వెంకట్రావు
గుడివాడవెనిగండ్ల రాము
పెడనకాగిత కృష్ణ ప్రసాద్‌
మచిలీపట్నంకొల్లు రవీంద్ర
పామర్రువర్ల కుమార రాజ
విజయవాడ సెంట్రల్‌బొండ ఉమ
విజయవాడ ఈస్ట్‌గద్దె రామ్మోహన రావు
నందిగామతంగిరాల సౌమ్య
జగ్గయ్యపేటశ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య
తాడికొండతెనాలి శ్రవణ్‌ కుమార్‌
మంగళగిరినారా లోకేశ్‌
పొన్నూరుధూళిపాళ్ల నరేంద్ర
వేమూరు(ఎస్సీ)నక్కా ఆనంద్‌బాబు
రేపల్లెఅనగాని సత్యప్రసాద్‌
బాపట్లవి.నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు(ఎస్సీ)బూర్ల రామాంజినేయులు
చిలకలూరిపేటప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లికన్నా లక్ష్మినారాయణ
వినుకొండజీవీ ఆంజనేయులు
మాచర్లజూలకంటి బ్రహ్మానందరెడ్డి
యర్రగొండపాలెం (ఎస్సీ)గూడూరి ఎరిక్సన్‌ బాబు
పర్చూరుఏలూరి సాంబశివరావు
అద్దంకిగొట్టిపాటి రవికుమార్‌
సంతనూతలపాడు (ఎస్సీ)బొమ్మాజి నిరంజన్‌ విజయ్‌కుమార్‌
ఒంగోలుదామచర్ల జనార్దనరావు
కొండపిడోలా బాల వీరాంజనేయస్వామి
కనిగిరిముక్కు ఉగ్రనరసింహారెడ్డి
కావలికావ్య కృష్ణారెడ్డి
నెల్లూరు సిటీపి. నారాయణ
నెల్లూరు రూరల్‌కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
గూడూరు (ఎస్సీ)పాశం సునీల్‌కుమార్‌
సూళ్లూరుపేట (ఎస్సీ)నెలవేల విజయశ్రీ
ఉదయగిరికాకర్ల సురేశ్‌
కడపమాధవిరెడ్డి
రాయచోటిమండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
పులివెందులమారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
మైదుకూరుపుట్టా సుధాకర్‌ యాదవ్‌
ఆళ్లగడ్డభూమా అఖిలప్రియ
శ్రీశైలంబుడ్డా రాజశేఖర్‌రెడ్డి
కర్నూలుటీజీ భరత్‌
పాణ్యంగౌరు చరితా రెడ్డి
నంద్యాలఎన్‌ఎండీ ఫరూక్‌
బనగానపల్లిబీసీ జనార్దనరెడ్డి
డోన్‌కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
పత్తికొండకేఈ శ్యాంబాబు
కోడుమూరుబొగ్గుల దస్తగిరి
రాయదుర్గంకాలవ శ్రీనివాసులు
ఉరవకొండకేశవ్‌
తాడిపత్రిజేసీ అస్మిత్‌ రెడ్డి
శింగనమల (ఎస్సీ)బండారు శ్రావణి శ్రీ
కల్యాణదుర్గంఅమిలినేని సురేంద్రబాబు
రాప్తాడుపరిటాల సునీత
మడకశిర (ఎస్సీ)ఎం.ఈ. సునీల్‌కుమార్‌
హిందూపురంనందమూరి బాలకృష్ణ
పెనుకొండసవిత
తంబళ్లపల్లెజయచంద్రారెడ్డి
పీలేరునల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి
నగరిగాలి భానుప్రకాశ్‌
గంగాధర నెల్లూరు (ఎస్సీ)డాక్టర్‌ వీఎం. థామస్‌
చిత్తూరుగురజాల జగన్మోహన్‌
పలమనేరుఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి
కుప్పంనారా చంద్రబాబు నాయుడు

ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థులు వీరే

కాకినాడ రూరల్‌నానాజీ
నెల్లిమర్లలోకం మాధవి
తెనాలినాదెండ్ల మనోహర్‌
అనకాపల్లికొణతాల రామకృష్ణ.
రాజానగరం* రామకృష్ణుడు

సీట్ల పంపకంలో జనసేన నేతల అసంతృప్తి

పార్టీల పొత్తు కుదిరింది, సీట్ల లెక్క కూడా తేలింది కానీ ఇప్పుడే జనసేన పార్టీ కి అసలు సమస్య మొదలైంది. అయితే సీట్ల పంపకంపై సొంత పార్టీలోనే అసంతృప్తి కనిపిస్తోంది. మరోవైపు జనసేనకు కేవలం 24 సీట్లు ఇచ్చేంత హీనమైన పరిస్థితి పార్టీ లో ఉందా అని ప్రశ్నించారు హరిరామజోగయ్య.

టీడీపీ, జనసేన సీట్ల పంపకంపై ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ రచ్చ జరుగుతోంది. పొత్తుల్లో భాగంగా మొదటి జాబితాలో టీడీపీ 94, జనసేన 24 సీట్లలో పోటీ చేయబోతున్నట్టు ఆయా పార్టీలు ప్రకటించాయి. అయితే జనసేనకి కేవలం 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు ఇవ్వడంతో సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది. దీనిపై జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన సీట్లంటే కనీసం 40 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలు ఇవ్వడమే అని ఆయన అన్నారు. ప్రకటించకుండా ఉన్న మిగిలిన 57స్థానాల్లో 16 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్‌ టికెట్లు కచితంగా కావాల్సిందేనని అన్నారు.

పొత్తులో మాట్లాడుకున్న దాని ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదని సీనియర్ కాపు నేత హరిరామజోగయ్య పేర్కొన్నారు. జనసేన యొక్క శక్తిని పవన్‌ కళ్యాణ్ ను తక్కువ అంచనా వేసుకుంటున్నారని 24 సీట్ల కేటాయింపు జనసేన పార్టీ నీ సంతృప్తిపరచలేదని చెప్పారు. జనసేన పార్టీ శ్రేణులు రాజ్యాధికారంలో గౌరవ వాటా కోరుకుంటున్నారని అంతే కాకుండా పవన్‌ కళ్యాణ్ ను రెండున్నరేళ్లు సీఎంగా చూడాలనేది వాళ్లకోరిక అని హరిరామజోగయ్య తెలియచేశారు. సొంత పార్టీ శ్రేణులను సంతృప్తిపరచకుండా వైసీపీని ఎలా ఓడించగలరని లేఖలో ఆయన పేర్కొన్నారు. more

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Sreekanth Maravindla, I am the Writer and Founder of this blog and share all the information related Trending News , Local News, Movie Updates, Politics, Health Tips, Job Opportunities and Technology through this website.

Leave a Comment