కల్కి 2898 AD మూవీ క్లైమాక్స్ లీక్! Kalki 2898 AD Movie Climax Scene Leaked

పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి ట్రైలర్ రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ యొక్క క్లైమాక్స్ లీక్ అవ్వడం ప్రభాస్ అభిమానులను చాలా టెన్షన్ పడుతోంది. మరి ఆ క్లైమాక్స్ కథ ఏంటో మనం ఓ లుక్కేద్దాం పదండి.
రెబల్ స్టార్ ప్రభాస్ తోపాటు దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ వంటి పెద్ద పెద్ద నటీనటులు నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీపై అందరికి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నెల జూన్ 27న రిలీజ్ కాబోతున్న కల్కి 2898 మూవీకి సంబంధించిన ప్రమోషన్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.
కొద్ది రోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన ఒక ఈవెంట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున నిర్వహించి సినిమాలోని బుజ్జి అనే కార్ ను అందరికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. బుజ్జీకి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన వాయిస్ తో డబ్బింగ్ చెప్తోంది. కాగా జూన్ 10న కల్కి 2898 ఏడీ యొక్క ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఓ వర్గం ప్రేక్షకులు ఈ ట్రైలర్ ను ట్రోల్ చేసినప్పటికీ, కాకపోతే ప్రభాస్ అభిమానులు మాత్రం విజువల్ ఫీస్ట్ అంటూ సంతోషపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కల్కి 2898 ఏడి మూవీ క్లైమాక్స్ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.

ఈ సినిమా ట్రైలర్ లో దీపికా పదుకొనే ఓ బిడ్డకు తల్లి కాబోతున్నట్టుగా చూపించారు. ఇంకా అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ అనే పాత్రను పోషిస్తున్నాడని, ఆ బిడ్డను రక్షించే రక్షకుడిగా పని ఆయన చేస్తున్నాడని ట్రైలర్ ద్వారా వెల్లడించారు. ఇక కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ అనే కాబోయే దేవుడి దౌర్జన్న్యాన్ని అంతం చేయడానికి ఆ బిడ్డ పుట్టబోతున్నట్టుగా ట్రైలర్ ను చూస్తుంటే మన అందరికి అర్థమవుతుంది.
మరికొందరు మాత్రం ఈ ట్రైలర్ లో ఒక డిఫరెంట్ స్టోరీని వెతికారు. అది ఏంటి అంటే దీపికకు పుట్టబోయే బిడ్డ కల్కి పునర్జన్మ అని అంటున్నారు. అంటే కమల్ హాసన్ దీపికకు మళ్లీ పుట్టబోతున్నాడు అని టాక్ బయట నడుస్తోంది. అయితే అశ్వద్ధామ ఆ పుట్టబోయే బిడ్డను కల్కి అని పొరబడతాడు అంటూ టాక్ నడుస్తోంది. అంతేకాదు ప్రాజెక్ట్ కే అంటే కల్కి కాదు కలి అంటూ ఈ ట్రైలర్ ను డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరగా బైరవని అసలైన కల్కి అని రివీల్ చేస్తారని వారు చెప్తున్నారు.
View this post on Instagram
అయితే దీపికకు పుట్టబోయే బిడ్డగా క్లైమాక్స్‌లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇంట్రడ్యూస్ అవుతారనే విషయం కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. అయితే గత కొద్దికాలంగా ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు నటిస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ఈ సినిమా చివర్లో కల్కిగా హీరో విజయ్ దేవరకొండ వస్తారని నెటిజన్లు ఊహిస్తున్నారు.
అయితే ట్రైలర్ ను చూశాక మాత్రం సినిమా మొత్తం మెయిన్ గా ప్రభాస్, బుజ్జి, దీపికా, బిగ్ బీ, కమల్ ల చుట్టే తిరుగుతుందనే విషయం అందరికి క్లారిటీ వచ్చింది. అంతేకాదు ఈ ట్రైలర్ సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేసింది. మరి అసలు సినిమాలో దీపికాకు పుట్టబోయే బిడ్డ ఎవరో తెలియాలంటే జూన్ 27న మూవీ థియేటర్లలోకి వచ్చేదాకా మరి ఆగాల్సిందే. more