Freshers కి good news ఇక జాబ్ కష్టాలు
Freshers కు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో చాలా Job అవకాశాలు మెరుగుపడనున్నాయి. కంపెనీలలో ఫ్రెషర్ల నియామకాల ధోరణి 6% శాతం పెరిగినట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలియజేసింది. 2023 మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్ల నియామకాలు 62% శాతంగా ఉంది, కానీ 2024 మొదటి ఆరు నెలలకు సంబంధించి 68% శాతానికి గణనీయంగా పెరిగినట్టు పేర్కొంది.
ఇక గత ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంతో పోలిస్తే 3% శాతం వృద్ధి చెందింది. ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలలకు సంబంధించిన career outlook నివేదికను టీమ్‌లీజ్ ఎడ్టెక్ విడుదల చేసింది. అన్ని రకాల విభాగాల్లో ఉద్యోగుల నియామకాల ఉద్దేశ్యం ప్రస్తుత ఏడాది జనవరి నుంచి జూన్ వరకు స్వల్పంగా పెరిగి 79.3% శాతానికి చేరింది.
ఈ స్థిరమైన వృద్ధి రానున్న నెలల్లో ఫ్రెషర్ల ఉద్యోగ నియామకాలకు సంబంధించి సానుకూలతను సూచిస్తున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ ఒక నివేదిక తెలిపింది. ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునే విషయంలో E-Commerce and Technology startups (55% శాతం), Engineering and Infrastructure (53% శాతం), Telecommunications (50% శాతం) కంపెనీల్లో ఉద్దేశ్యం వ్యక్తమైంది. ఇక IT రంగంలో మాత్రం గతేడాది మొదటి ఆరు నెలలో పోలిస్తే, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్లను తీసుకునే ఉద్దేశ్యం తగ్గినట్టు తెలుస్తుంది. 49% శాతం నుంచి 42% శాతానికి తగ్గింది. Media and Entertainment రంగంలో 3% శాతం, Travel and Hospitality 4% శాతం చొప్పున ఈ ఏడాది మొదటి ఆరు నెలలకు సంబంధించి ఉద్యోగ నియామకాల ధోరణి తగ్గింది.
వీరికి ఎక్కువ డిమాండ్ ఉంది
Graphic Designer , Legal associate , Chemical Engineer , Digital Marketing ఎగ్జిక్యూటివ్‌లకు సంబంధించి ఫ్రెషర్లకు డిమాండ్ ఎక్కువైంది. ఎన్ఎల్పీ, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఐవోటీ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, మెటావర్స్ ప్రముఖ డొమైన్ నైపుణ్యాలుగా ఉన్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలియచేసింది. మరి బెంగళూరులో ఫ్రెషర్లకు (69% శాతం) ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
ఆ తర్వాత ముంబైలో 58% శాతం, చెన్నైలో 51% శాతం, ఢిల్లీలో 51% శాతం చొప్పున ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునే విషయంలో కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. జెనరేషన్ ఏఐ ప్రభావం ఫ్రెషర్ల నియామకాలపై ఎంతవరకు ఉంటుందన్న దానిపైనా ఈ నివేదిక దృష్టి సాదించింది. సాఫ్ట్వేర్ డెవలపర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, గ్రాఫిక్ డిజైనర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, టెక్నికల్ రైటర్లు, లీగల్ అసిస్టెంట్ల ఉద్యోగాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని గుర్తించింది.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, వాటిని అమలు చేయడం వాళ్ల ఫ్రెషర్లకు ఉండ్యోగ అవకాశాలను పెంచుతాయని తెలిపింది. కనుక ఫ్రెషర్లు తమ నైపుణ్యాలను పెంచుకోవడమే కాకుండా, జెనరేషన్ ఏఐతో కలసి పనిచేసే విధంగా వారు సిద్ధంగా ఉండాలని సూచించింది. 18 రంగాల నుంచి 526 చిన్న, మధ్య, భారీ కంపెనీలను విచారించిన టీమ్‌లీజ్ ఎడ్టెక్ ఈ వివరాలను నివేదిక రూపంలో పొందుపరిచింది.FRe