బీఆర్‌ఎస్‌కు పెద్ద ఎదురుదెబ్బ
పార్లమెంటు ఎన్నికల ముంగిట ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది . జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బీఆర్‌ఎస్ పార్టీని వదిలి కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. బొంతు రామ్మోహన్ ఈ ఆదివారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు.
వారం రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కచ్చితంగా కప్పుకొంటారని సమాచారం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని రామ్మోహన్ భావిస్తున్నారు , ఇదే విషయాన్ని సీఎం రేవంత్ వద్ద చర్చించగా ఆయన పరిశీలిద్దామని చెప్పినట్లు తెలిసింది. విద్యార్థి దశలో ఏబీవీపీలో, ఆ తరువాత బీజేవైఎంలో క్రియాశీలంగా వ్యహరించిన బొంతు రామ్మోహన్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన అప్పటి టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచిన రామ్మోహన్‌కు మేయర్‌గా అవకాశం దక్కింది. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రామ్మోహన్.. 2018లో అసెం బ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఇందుకు కేటీఆర్ హామీ ఇచ్చినప్పటికీ.. పార్టీ అధినేత కేసీఆర్.. భేతి సుభా్‌షరెడ్డికి టికెట్ ఇచ్చారు. తిరిగి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ కోసం ప్రయత్నించగా.. ఆయనకు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనైనా మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్ అధినాయకత్వాన్ని రామ్మోహన్ కోరినట్టు తెలిసింది.
కానీ, ఇందుకు వారి నుంచి సానుకూల సంకేతాలు రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధమయ్యే సీఎం రేవంత్‌ను కలిసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఇటీవల సీఎంను కలిశారు. పాలనాపరమైన అంశాల కోసమేనని ఆమె చెప్పినప్పటికీ.. తాజా పరిణామాల నేపథ్యంలో మేయ ర్ అడుగులు ఎటువైపు? అన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి దంపతులూ పార్టీని వీడుతారన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదిర్శంచిన కాంగ్రెస్ పార్టీకి జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా దక్కని విషయం తెలిసిందే.
దీంతో లోక్‌సభ ఎన్నికల నాటికి గ్రేటర్‌లో పార్టీ బలోపేతం లక్ష్యంగా కాంగ్రెస్ ఆపరేషన్‌ఆకర్ష్‌కు తెర తీస్తోం ది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లను చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే 14 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో పార్టీ నేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.