వేడిని తగ్గించి షుగర్, బీపిలను కంట్రోల్ చేసే చిట్కాలు
ఎండాకాలంలో వేడిని తగ్గించి షుగర్, బీపిలను కంట్రోల్ చేసే చిట్కాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్, బీపిలను కంట్రోల్ చేయడం లో పెసలు, మనకు ఎంతగానో ఉపయోగ పడతాయి అయితే మనం వీటిని ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు.
వీటిని ఎలా తినాలంటే ?
పెసరపప్పు, పెసలు ఎంత రుచిగా ఉంటాయో. వీటిని తినడం వల్ల మనకు అంతే లాభాల ను ఇస్తాయి. అందుకే, వీటిని మనం రెగ్యులర్‌గా డైట్‌లో తీస్కోవడం చాలా మంచిది. ఎండాకాలం లో పెసరపప్పు, పెసరపప్పు చారు, పెసరెట్టు ఇలా చాలా రకాలుగా పెసలని వాడుకోవచ్చు ఎందుకంటే వీటిలోని ఉండే పోషకాలు కారణం గా వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మంచిది.. అలాగే బాగా చలువ చేస్తుంది. వీటిని మనం తినడం వల్ల ఎండాకాలంలో వచ్చే అధిక వేడిని, తాపాన్ని తగ్గించుకోవచ్చు.
దీనికోసం పెసలని మనం ఎలా అయినా తినొచ్చు. అయితే, ముఖ్యంగా వీటిని ఉడికించి తింటే ఇంకొన్ని అద్బుత లాభాలు మనం చూడొచ్చు పెసలని ప్లాంట్ బేస్డ్ ప్రోటీని చెప్తారు.ఇందులో చాలా అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటిలో ఉండే.. ప్రోటీన్స్, విటమిన్స్ ఎ, సిలు, మన బాడీలో నీ ఇమ్యూనిటీ లెవెల్స్ నీ పెంచుతాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, జింక్ కూడా ఉంటాయి. ఇన్ని లాభాలున్న ఈ పెసలని ఉడికించి ఉదయాన్నే తింటే చాలా లాభాలు ఉంటాయి.
హైబీపి కోసం
హైపీబి ఉన్నవారు పెసలు తింటే చాలా మంచిది. ఇవి రెగ్యులర్‌గా పెసలని ఏదో రకంగా తీసుకుంటే మనం తీసుకుంటూ ఉంటే హై బిపి కంట్రోల్ లో ఉంటుంది. అంతే కాదు ఇందులోని విటమిన్స్ మన హార్మోన్స్ ను ప్రేరేపిస్తాయి. దీనీ వల్ల ఎదిగే పిల్లలలో ఇది మంచి ఆహారమని చెప్పొచ్చు. ఇది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి.
పెసల్ని రెగ్యులర్‌గా తింటే ఎంతో యవ్వనంగా కనిపిస్తార ఇందులో ఉండే కాపర్ చర్మంపై వచ్చే ముడతలను తగ్గిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఫ్రీ రాడికల్స్‌ని నుంచి స్కిన్ డ్యామేజ్ కాకుండా ఎంతో హెల్ప్ చేస్తాయి అదే విధంగా, కొల్లాజెన్ ప్రొడక్షన్‌ని తగ్గిస్తాయి.
రక్తప్రసరణ
పెసలలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది వీటిని తినడం వల్ల మనలో రక్తం శాతం పెరిగి రక్త సరఫరా సరిగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని ఐరన్ వల్ల శరీరంలోని అన్ని అవయవలన్నిటికి ఆక్సీజన్‌ని సమృద్ధిగా అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ పెసలని మీరు మీ డైట్‌లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది.
షుగర్ కంట్రోల్ అయ్యేందుకు
పెసలలో తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మన బాడి ఇన్సులిన్ లేవల్స్ ను తగ్గిస్తుంది. అదే విధంగా బ్లడ్ గ్లూకోజ్, ఫ్యాటి లెవల్స్‌ని కూడా తగ్గిస్తుంది. దీని వల్లే చాలా మంది బరువు కూడా ఈజీగా తగ్గుతారు. షుగర్ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పెసలని వారి డైట్‌లో యాడ్ చేసుకోదానికి ప్రయత్నించండి.
ఎలా తినాలంటే ?
ప్రతిరోజు ఉదయాన్నే హెల్దీగా బ్రేక్‌ఫాస్ట్ తినడం ఎంతో మంచిది. ఇలా తినడం వల్ల మనకి ఎన్నో పోషకాలు అందుతాయి పెసలని మనం మొలకల్లా చేసి తినొచ్చు లేదా మనం ఉడికించి కూడా తినొచ్చు. దీని వల్ల మంచి ప్రోటీన్, ఫైబర్ బాడీకి అందుతుంది దీని వల్ల మీరు రోజంతా యాక్టివ్‌గా అంటారు.
ప్రోటీన్, ఫైబర్ బాడీకి అందాల్సిన పోషకాలు. దీని వల్ల చాలానే లాభాలు ఉంటాయి. అయితే, మనం పచ్చి మొలకల బదులు వీటిని ఉడికించి తింటే ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు అయ్యే అవకాశం చాల తక్కువుగా.. ఉంటుంది. వీటిని మనం చక్కగా మనం ప్రతిరోజు డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు పెసరపప్పు చారు, పెసరపప్పు పులగం, పెసరపప్పు హల్వా, పెసరపప్పు పొంగల్.. అబ్బో ఇలా చాలా రకాలుగా చేయొచ్చు.
మరి ఇంకెందుకు లేట్ వెంటనే మీ డైట్ లో పెసలు లు add చేస్కోండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి…
వేడిని తగ్గించి షుగర్, బీపిలను కంట్రోల్ చేసే చిట్కాలు
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం మేము ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసము మాట్రమే.. వీటిని పాటించడం వల్ల వచ్చే
ఫలితాలు కేవలం వ్యక్తిగతం మాత్రమే. కాబట్టి వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే మంచి మార్గం.more